- Home
- Technology
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. వాటి రేటింగ్, స్కోర్ తెలుసుకోండి..
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. వాటి రేటింగ్, స్కోర్ తెలుసుకోండి..
ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశంలో ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ప్రాసెసర్‌లో ఖచ్చితంగా తేడా ఉన్నప్పటికీ చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఒకే డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. గత కొంతకాలంగా స్నాప్‌డ్రాగన్ 700 సిరీస్ చిప్‌సెట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉన్న ఫోన్‌లు కూడా మార్కెట్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఎంత శక్తివంతమైనదో బెంచ్‌మార్క్ స్కోరు టెస్ట్ ద్వారా తెలుస్తుంది. తాజాగా ఆన్ టుటు (AnTuTu) స్కోర్ ఎక్కువగా చర్చించబడుతోంది. ఆన్ టుటు ప్రకారం జూలై 2021లో మార్కెట్లో ఉన్న అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి...
ఆన్ టుటు బెంచ్‌మార్క్ రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న పేరు 8,54,439 స్కోరుతో బ్లాక్ షార్క్ 4 ప్రో. ఈ స్కోరు గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది. దీని తరువాత నుబియా రెడ్ మ్యాజిక్ 6 ప్రో పేరు రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో వన్‌ప్లస్ 9 ప్రో పేరు ఉంది, దీనికి 8,22,338 స్కోరు వచ్చింది.
సింపుల్ గా చెప్పాలంటే ఈ మూడు ఫోన్‌లు ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 888 ఉపయోగించారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 3 ప్రో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ జాబితాలోని నాలుగో పేరు, రియల్‌మే జిటి, వన్‌ప్లస్ 9, వివో ఎక్స్ 60 ప్రో ప్లస్, ఐక్యూ 7, మీజు 18 అండ్ షియోమి ఎంఐ 11 అల్ట్రా వంటి స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు వరుసగా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జిబి ర్యామ్ ఉంది. వీటిలో వన్ ప్లస్ 9, వివో ఎక్స్60 ప్రొ ప్లస్, ఐక్యూ 7, షియోమీ ఎంఐ 11 అల్ట్రా వంటి స్మార్ట్‌ఫోన్‌లు కూడా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.