జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ : ఇప్పుడు టీవీ నుండి కూడా వీడియో కాల్స్ చేయవచ్చు.. ఎలా అంటే ?
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు స్మార్ట్ టీవీల నుండి వీడియో కాల్స్ చేయవచ్చు. జియో ఫైబర్ ఈ ఫీచర్‌కు మొబైల్ ఆన్ కెమెరా అని పేరు పెట్టింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జియో ఫైబర్ వినియోగదారులకు టీవీ నుండి వీడియో కాల్స్ చేయడాని కోసం ప్రత్యేక కెమెరా అవసరం లేదు.
జియో ఫైబర్ ఈ కొత్త ఫీచర్ జియో జాయిన్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. జియో జాయిన్ ని ఇంతకు ముందు జియో కాల్ అని పిలీచేవారు. జియోజాయిన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు జియో జాయిన్ యాప్ సహాయంతో వినియోగదారులు ఫోన్ కెమెరాను వీడియో కాల్స్ కోసం ఇన్‌పుట్ డివైజ్ గా ఉపయోగించవచ్చు.
జియో ఫీబార్ తో జియో ఫీబార్ వాయిస్ పేరుతో కాలింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. జియో జాయిన్ యాప్ నుండి జియో వినియోగదారులు మొబైల్స్ ద్వారా ల్యాండ్‌లైన్ నంబర్ల నుండి వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే జియో గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ని పరీక్షిస్తోంది, ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల కోసం ప్రవేశపెట్టింది.
జియో ఫైబర్ కస్టమర్‌లు టీవీ నుండి వీడియో కాల్స్ ఎలా చేయాలి?
మొబైల్ కెమెరా నుండి టీవీలో వీడియో కాలింగ్ చేయడానికి ముందుగా మీరు మొబైల్ నంబర్‌తో జియో జాయిన్ యాప్‌లో సైన్ ఇన్ చేయాలి. దీని తర్వాత యాప్‌లో కనిపించే 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను ఆన్ చేయాలి. దీని తర్వాత మీరు మీ టీవీలో వీడియో కాల్స్ చేయవచ్చు. మెరుగైన కాలింగ్ కోసం 5GHz వై-ఫై బ్యాండ్‌ని ఉపయోగించాలని జియో ఫైబర్ సూచించింది.
తాజాగా షియోమీ, వన్ ప్లస్ వంటి కంపెనీలు టివి నుండి కాల్ చేయడానికి వెబ్‌క్యామ్‌లను ప్రవేశపెట్టాయి, అయితే జియో మొబైల్ కెమెరాను టివిలో వెబ్‌క్యామ్‌గా ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందించింది, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అంతేకాకుండా జియో ఫైబర్ కస్టమర్‌లు ప్రత్యేకంగా వెబ్‌క్యామ్‌ను కొనుగోలు చేయనవసరం లేదు.