MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • జియో న్యూ ఇయర్ ఆఫర్: ఒక నెల వాలిడిటీ ఫ్రీ అలాగే అపరిమిత కాలింగ్ ఇంకా డేటా కూడా..

జియో న్యూ ఇయర్ ఆఫర్: ఒక నెల వాలిడిటీ ఫ్రీ అలాగే అపరిమిత కాలింగ్ ఇంకా డేటా కూడా..

 దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి సంవత్సరం చివరిలో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను అందిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే జియో కస్టమర్లు ఈ సంవత్సరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు ఈ నిరీక్షణ ముగిసింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 27 2021, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 ఏంటంటే ఎప్పుడు జియో కస్టమర్లకు ఒక నెల వాలిడిటీని ఉచితంగా అందిస్తుంది. జియో  రూ. 2,545 ప్రీ-పెయిడ్ ప్లాన్ ఇప్పుడు కొత్త మార్పుతో ముందుకు వచ్చింది. దానితో పాటు హ్యాపీ న్యూ ఆఫర్ గురించి తెలుసుకుందాం...


 హ్యాపీ న్యూ ఇయర్ 2022 ఆఫర్ 
డిసెంబర్ 1న రిలయన్స్ జియో  రిచార్జ్ ప్లాన్లను అప్ డేట్ చేసింది దీంతో  ఒక సంవత్సరం వ్యాలిడిటీగల ప్రీ-పెయిడ్ ప్లాన్‌  రూ.2545ను మార్పు చేసింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు 336 రోజుల వాలిడిటీని పొందుతున్నారు, అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఈ ప్లాన్ వాలిడిటీ ఇప్పుడు 365 రోజులకు పెంచబడింది అంటే ఈ ప్లాన్  వాలిడిటీ అదనంగా మరో  29 రోజులు పెరిగింది. జియో ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే, అయితే ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడు అనే దాని గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే ఒక నివేదిక ప్రకారం, ఈ ప్లాన్ 2 జనవరి  2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

జియో  రూ. 2,545 ప్లాన్  ప్రయోజనాలు 
ఈ లాంగ్ వాలిడిటీ గల జియో  ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 GB డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా లభిస్తాయి. ఇంకా  అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు జియో టి‌వి, జియో సినిమా , జియో సెక్యూరిటి, జియో క్లవ్డ్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. లాంగ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.

33

జియో  రూ.1 ప్లాన్
రిలయన్స్ జియో ఈ నెల ప్రారంభంలో రూ.1 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, అయితే దీని గురించి చాలా చర్చ జరిగింది. ఈ ప్లాన్ ఇంతకు ముందు ఒక నెల వాలిడిటీతో వచ్చింది కానీ ప్రజలు ఎక్కువగా రీఛార్జ్‌లు చేయడం ప్రారంభించడంతో దాని ప్రయోజనాలను తగ్గించింది. ప్రస్తుతం జియో  రూ.1 ప్లాన్‌ జియో యాప్ అండ్ వెబ్ సైట్ లో అందుబాటులో లేదు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!
Recommended image2
Smart Phone: ఈ ఒక్క తప్పు వల్లే మీ ఫోన్ బ్యాటరీ పాడవుతోంది
Recommended image3
Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved