జియో బంపర్ ఆఫర్.. అమెజాన్, నెట్ ఫ్లిక్ సహా 15 యాప్స్ ఫ్రీ..
భారత టెలికాం రంగంలో భారీ పోటీ నెలకొంది. కొత్త కొత్త ప్లాన్ల ద్వారా టెలికాం కంపెనీలు కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు రిలయన్స్ జియో JioFiber అండ్ JioAirFiber కస్టమర్ల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. OTT యాప్స్ ఎక్కువగా ఉపయోగించే కస్టమర్‌లకు ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.
ఈ ప్లాన్ కింద, కస్టమర్‌లు పదిహేను ప్రీమియం OTT అప్లికేషన్‌ల సబ్ స్క్రిప్షన్ పొందుతారు. దీనితో పాటు ఆన్ లిమిటెడ్ (unlimited) డేటా కూడా లభిస్తుంది. దీని వల్ల మీకు ఇష్టమైన యాప్‌లలో ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రోగ్రామ్‌లు, షోలు, సినిమాలు చూడవచ్చు. అదేవిధంగా, ఈ ప్లాన్ కోసం నెలకు రూ. 888 ఖర్చు అవుతుంది.
ఈ కొత్త ప్లాన్ ప్రకారం, 30 Mbps స్పీడ్ లభిస్తుంది. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియం వంటి పదిహేను కంటే ఎక్కువ టాప్ OTT అప్లికేషన్‌ల ఆక్సెస్ లభిస్తుంది. ఈ అప్లికేషన్లు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కొత్త సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే కాకుండా, ఇప్పటికే జియో ప్లాన్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది.
చెప్పాలంటే ఈ రూ.888 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉన్న కస్టమర్‌లు ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ కావచ్చు.
మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇటీవల ప్రకటించిన Jio IPL ధన్ ధన్ ధన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది. JioFiber లేదా AirFiber అర్హత కలిగిన కస్టమర్‌లు తమ Jio హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై యాభై రోజుల డిస్కౌంట్ క్రెడిట్ వోచర్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ మే 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది, Jio ధన్ ధన్ ధన్ (DDD) ఆఫర్ ప్రత్యేకంగా T20 సీజన్ కోసం రూపొందించారు.