90 రోజులు రీఛార్జ్ లేకపోయినా సిమ్ యాక్టివ్‌గా ఉంటుందా?
90 రోజులు రీఛార్జ్ చేయకపోయినా సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.ఇది ఎలా సాధ్యం? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.

టెలికాం కంపెనీల పోటీ
భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా టెలికాం సేవలను అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు వివిధ ధరలలో రీఛార్జ్ ప్లాన్‌లను అమలు చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు పోటీ పడుతున్నాయి.
మీరు రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా..?
గత సంవత్సరం జులైలో ఛార్జీల పెంపు అమలులోకి వచ్చినప్పటి నుండి అన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఖరీదైనవి అయిపోయాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ TRAI) జోక్యం తర్వాత కేవలం టాక్ టైమ్ ప్లాన్‌లను కూడా టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. అయినప్పటికీ రెండు సిమ్ కార్డ్ లను ఉపయోగించేవారికి ఈ ప్లాన్‌లు ఖరీదైనవిగానే ఉన్నాయి..
ప్రాథమిక రీఛార్జ్ అవసరం లేదు
చాలా మంది వివిధ కారణాలతో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. కొందరు వ్యక్తిగత అవసరాల కోసం ఒక సిమ్ కార్డును, ఆఫిషియల్ పనులకు మరో సిమ్ కార్డును వాడుతుంటారు. ఇలా మంచి నెట్‌వర్క్ కవరేజ్ కోసం, బ్యాంకింగ్ సేవల కోసం రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటివారికి రీచార్జ్ ప్లాన్స్ భారంగా మారాయి. దీన్ని పరిష్కరించడానికి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ లేకుండానే ఎక్కువ కాలం ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లను స్వీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. దీని ద్వారా వారు ఎటువంటి ప్రాథమిక రీఛార్జ్ లేకుండానే కనెక్ట్ అవ్వవచ్చు.
మీ సిమ్ డీయాక్టివేట్ అవుతుందా?
మీరు మీ మొబైల్ నంబర్‌ను 90 రోజుల పాటు ఉపయోగించకపోతే అది డీయాక్టివేట్ అవుతుంది. ఈ సిమ్ అకౌంట్లో వాయిస్ లేదా వీడియో కాల్స్, అవుట్‌గోయింగ్, ఎస్ఎంఎస్ లేదా డేటా వినియోగం ఇంకా మిగిలివుంటుంది… కానీ మీరు సిమ్ ను ఉపయోగించకపోవడంవల్ల డీయాక్టివేట్ అవుతుంది.
90 రోజుల తర్వాత కూడా సిమ్ యాక్టివ్‌గా ఉంటుందా?
అయితే 90 రోజుల తర్వాతా మీ సిమ్ కార్డులో బ్యాలెన్స్ రూ.20 కంటే ఎక్కువ ఉంటే టెలికాం కంపెనీలు ఆటోమేటిక్‌గా వాటిని తీసుకుని మరో 30 రోజులకు సేవలను పొడిగిస్తాయి. మీ బ్యాలెన్స్ రూ.20 కంటే తక్కువ అయ్యేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఆ తర్వాత మీ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది.
సిమ్ యాక్టివేట్ చేయడానికి ఎన్ని రోజుల గడువు?
మీ నంబర్ డీయాక్టివేట్ అయితే రూ.20 చెల్లించి దాన్ని తిరిగి యాక్టివేట్ చేయడానికి మీకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈ గడువులోపు మీరు రియాక్ట్ కాకపోత చెల్లించకపోతే మీ నంబర్ శాశ్వతంగా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఈ విధానం అన్ని టెలికాం కంపెనీలకు వర్తిస్తుంది.