MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Jio, Airtel, BSNL, Vi:ఒక నెల ఫుల్ వ్యాలిడిటీతో చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఇవే..

Jio, Airtel, BSNL, Vi:ఒక నెల ఫుల్ వ్యాలిడిటీతో చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఇవే..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆర్డర్ తర్వాత దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు ఒక నెల వాలిడిటీ సంబంధిత ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు Jio, Airtel, Vodafone Idea అండ్ BSNLలో 30 అలాగే 31 రోజుల వాలిడిటీతో ఎన్నో ప్లాన్‌లు ఉన్నాయి. కొన్ని ప్లాన్‌లు ప్రీ-పెయిడ్ కస్టమర్‌ల కోసం ఇంకా కొన్ని పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం ఉన్నాయి, అయితే  జియో, ఎయిర్‌టెల్, BSNL, Vi అన్ని ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీ గురించి  మీకోసం..

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jun 14 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జియో  ఒక నెల ప్లాన్ ధర రూ. 259. ఈ ప్లాన్ తో మీకు ఒక నెల పూర్తి వాలిడిటీ పొందుతారు, అంటే మీరు ఏప్రిల్ 1వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మీరు తదుపరి రీఛార్జ్‌ను మే 1వ తేదీన మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు ప్రతిరోజూ 1.5 GB డేటాను పొందుతారు. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. మీరు ఈ ప్లాన్‌ని ఒకే సమయంలో అనేక సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి నెల వాలిడిటీ గడువు ముగిసిన తర్వాత, కొత్త ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్‌తో  ప్రతిరోజూ 100 SMSలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌తో కూడా ఇతర ప్లాన్‌ల లాగానే Jio అన్ని యాప్‌లు సబ్‌స్క్రైబ్ పొందవచ్చు.
 

26

ఎయిర్‌టెల్ ఒక నెల వాలిడిటీతో రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, ఒకటి రూ.296 మరొకటి రూ.319. ఎయిర్‌టెల్ ఈ రెండు కొత్త ప్లాన్‌లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. రూ. 296 ప్లాన్‌తో  కస్టమర్‌లు 30 రోజుల వాలిడిటీ పొందుతారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకి ఆన్ లిమిటెడ్ కాలింగ్  ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 SMSలు  ఉంటాయి. ఈ ప్లాన్‌లో మొత్తం 25GB డేటా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్‌తో Amazon Prime వీడియో సబ్‌స్క్రిప్షన్  ఉండదు.

36

VI ఒక నెల వాలిడిటీ రూ. 327, రూ. 377తో రెండు ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 327 ప్లాన్ గురించి మాట్లాడితే, కస్టమర్లు ఇందులో మొత్తం 25 GB డేటాను పొందుతారు. అంతేకాకుండా ఇందులో ప్రతిరోజూ 100 SMSలు ఉంటాయి. ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది, దీని వాలిడిటీ 30 రోజులు.

46

ఇప్పుడు రెండవ ప్లాన్ అంటే రూ. 337 గురించి మాట్లాడుకుంటే అందులో మొత్తం 28 GB డేటా ఉంటుంది, దీని వాలిడిటీ 31 రోజులు. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 SMSలు, ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.

56

BSNLలో రూ. 147 ప్లాన్‌ ఉంది, దీనిలో మొత్తం 10 GB డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకి ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. రెండవ ప్లాన్ రూ. 247, ఇందులో 50 GB డేటా ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులు. EROS Now సబ్‌స్క్రిప్షన్ రెండు ప్లాన్‌లలో ఉంటుంది.
 

66

BSNLలో రూ. 299 ప్లాన్‌ కూడా ఉంది, దీని వాలిడిటీ  30 రోజులు. ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్,  రోజుకు 3GB డేటాతో 100 SMS లభిస్తాయి.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved