ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చే నెల నుండి ఈ ఫీచర్ కనిపించదు.. అదేంటో తెలుసా..
ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (instagram)వచ్చే నెల నుండి థ్రెడ్స్ (threads) ఫీచర్‌ను మూసివేయనుంది. థ్రెడ్స్ స్నాప్‌చాట్(snapchat) వంటి మెసేజింగ్ యాప్ ద్వారా 2019లో ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభించింది. వచ్చే వారం నుండి వినియోగదారులు దీని నోటిఫికేషన్‌ను పొందడం ప్రారంభిస్తారు.
ఈ ఫీచర్‌ను మూసివేయడంతో ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ స్టోరీలకు విడిగా మ్యూజిక్ జోడించడానికి ఒక ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది, ఈ ఫీచర్ ఇప్పటికే రీల్స్ స్టోరీలకు అందుబాటులో ఉంది.
ఒక ఇంగ్లీష్ టెక్నాలజీ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ ఈ ఏడాది డిసెంబర్ చివరిలో మూసివేయనుంది. నవంబర్ 23 నుండి వినియోగదారులు దీని నోటిఫికేషన్‌ను పొందడం ప్రారంభిస్తారు. అండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ అక్టోబర్ 2019లో థ్రెడ్స్ ని పరిచయం చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ స్నాప్‌చాట్‌కి చాలా పోలి ఉంటాయి, దీనిలో యూజర్‌లు ఫోటోలు లేదా వీడియోలను క్లోజ్ ఫ్రెండ్స్‌తో విజువల్‌గా షేర్ చేయడానికి అనుమతిస్తుంది, అయితే క్లోజ్ ఫ్రెండ్ లిమిట్ ని గత సంవత్సరం తొలగించారు. ప్రస్తుతం అందరికీ ఓపెన్ గా ఉంది.
థ్రెడ్స్ ఫీచర్‌ను నిలిపివేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు. ఫీడ్ స్టోరీకి మ్యూజిక్ జోడించే ఫీచర్ భారత్‌తో సహా బ్రెజిల్, టర్కీలో పరీక్షించబడుతోంది. మ్యూజిక్ ఫీచర్ మీ ఖాతాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడితే, మీరు యాడ్ మ్యూజిక్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మ్యూజిక్ జోడించవచ్చు. లైబ్రరీ విభాగంలో మీరు మ్యూజిక్ కోసం ఎన్నో ఆప్షన్స్ కనుగొంటారు.