భారతదేశం vs ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్: ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫ్రీగా చూడావచ్చంటే..?
భారత్ vs ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగనుంది. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో భారత్ ఓడించిన తర్వాత ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్స్ ఆడేందుకు భారత్ పోటీపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
World Cup Final
ముఖ్యంగా భారత్‌లో ప్రస్తుతం ఈ మ్యాచ్‌కి క్రేజ్ పీక్స్‌లో ఉంది. నవంబర్ 19 నుండి 20 మధ్య భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి అహ్మదాబాద్‌కి రిటర్న్ టిక్కెట్ ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు రూట్లలో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. రిటర్న్ టికెట్ ఛార్జీలు సుమారు రూ. 35,000 నుండి రూ. 80,000 మధ్య ఉన్నాయి. దీని బట్టి చూస్తే సాధారణ రేట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి.
ఈ మ్యాచ్‌కు ప్రపంచకప్ విజేత కెప్టెన్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు కూడా ఆహ్వానం అందింది. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
IND vs AUS క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఉచితంగా చూడటం ఎలా
IND vs AUS క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు (IST) మొదలవుతుంది, అయితే నవంబర్ 19న మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్ జరుగుతుంది. ఇతర మ్యాచ్‌ల లాగానే ఈ రాబోయే ఫైనల్ మ్యాచ్ కూడా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది ఇంకా యాప్ లో ఉచితంగా చూడవచ్చు. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకున్న వారు డిస్నీ+ హాట్‌స్టార్‌కు షబ్ స్క్రిప్షన్ పొందాలి. టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా లైవ్ చూడవచ్చు.
IND vs AUS
2003లో భారత్ ఆస్ట్రేలియాతో పోటీపడి చివరికి వరల్డ్ కప్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ పాత వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అయితే ఈ రెండు జట్లు మళ్లీ పోటీ పడాలని చూసేందుకు భారత క్రికెట్ అభిమానులందరూ ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నారు. 2003లో ఓటమికి ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భారత క్రికెట్ ప్రపంచ కప్ 2023 టీం
రోహిత్ శర్మ (క్యాప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, ప్రసీద్ కృష్ణ
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ 2023 టీం
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (క్యాప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్