MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • 'గ్రహాంతర జీవుల' గుప్పిట్లో.. ?! దొరికిన 130 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ షిప్, పరిశోధకులు షాక్!

'గ్రహాంతర జీవుల' గుప్పిట్లో.. ?! దొరికిన 130 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ షిప్, పరిశోధకులు షాక్!

130 ఏళ్ల క్రితం మంచులో అదృశ్యమైన షిప్ దీని పేరు ఆఫ్రికా దొరికింది. అయితే, దాని పరిశోధనలు నిపుణులను ఆశ్చర్యపరిచాయి. డైలీ స్టార్ నివేదించిన ప్రకారం, షిప్ కి పెద్దగా నష్టం(damage) జరగలేదు, కానీ దానిని కనుగొన్న  సమయంలో షిప్ గుర్తించలేని ఇన్వేసివ్ మస్సెల్‌(invasive mussel)లతో కప్పబడి ఉంది.  

1 Min read
Ashok Kumar
Published : Oct 21 2023, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

అక్టోబర్ 1895లో, US-కెనడా సరిహద్దులోని హురాన్  సరస్సు పై ఆఫ్రికా అనే షిప్ రహస్యంగా అదృశ్యమైంది. మరో దెబ్బతిన్న షిప్ పేరు సెవెర్న్‌ను లాగుతున్నప్పుడు ఆఫ్రికా షిప్ మునిగిపోయింది. ఈ షిప్ మంచులో మిస్టరీగా అదృశ్యమైంది. అయితే ఆ షిప్ లోని సిబ్బందిని రక్షించారు, కానీ ఆఫ్రికా  షిప్ జాడ ఇప్పటి దాకా కనుగొనబడలేదు. 
 

24
Asianet Image

వివిధ రకాల చేపలపై పరిశోధనలో భాగంగా ఈ ప్రాంతంలో ఒక డాక్యుమెంటరీని చిత్రీకరిస్తుండగా పరిశోధకులు వైవోన్నే డ్రేబర్ట్ అండ్ జాక్ మెల్నిక్ లు అనుకోకుండా ఈ అదృశ్యమైన ఆఫ్రికా షిప్ ని కనుగొన్నారని డైలీ స్టార్ నివేదించింది. ఈ సమయంలో ఇద్దరు శిథిలాల నుండి కొన్నిటిని బయటపడటం చూశారు. ఈ శిథిలాలు తొలిసారిగా కనిపిస్తున్నాయి. షిప్ ఇప్పుడు గుల్లతో కప్పబడి ఉందని వారు ఆశ్చర్యపోయారు. ఈ ఓస్టెర్(Oyster) జాతి ఈ ప్రాంతానికి పూర్తిగా తెలియని జాతి. పరిశోధకులు ఈ తెలియని జాతులను గ్రహాంతర జాతులు లేదా ఆక్రమణ జాతులు అని పిలుస్తారు. ఇన్వాసివ్ లేదా గ్రహాంతర జాతులు అనేది మొదట పర్యావరణంలోకి ప్రవేశించే జాతి. ఇంకా చాలా వేగంగా పెరుగుతుంది అలాగే దాని కొత్త పర్యావరణానికి హాని చేస్తుంది. 
 

34
Asianet Image

"మేము నమ్మలేకపోయాము. షిప్ అద్భుతమైన స్థితిలో ఉంది. ఇంకా సరస్సు లోపల నిటారుగా పడి ఉంది, ఉపరితలం నుండి నేరుగా పడిపోయినట్లుగా కింద  పార్క్ చేసినట్లుగా ఉందని" పరిశోధకులు తెలిపారు. 
 

44
Asianet Image

280 అడుగుల లోతులో నీటి అడుగున ROV (రిమోట్‌లీ ఆపరేటెడ్ వెహికల్) ఉపయోగించి ఆఫ్రికా షిప్  కనుగొనబడింది. 148 అడుగుల పొడవు, 26 అడుగుల వెడల్పు ఇంకా 12.5 అడుగుల ఎత్తుతో ఉన్న అవశేషాల భారీ కొలతలు పరిశోధకులను షిప్ కు దారితీసింది. షిప్ చుట్టూ బొగ్గు క్షేత్రం అవశేషాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికా అండ్  సెవెర్న్  చివరి సముద్రయానంలో తీసుకువెళ్లిన సరుకు ఇదే కావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.

About the Author

Ashok Kumar
Ashok Kumar
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved