వాట్సాప్ ఛానెల్‌ని ఎలా ఫాలో అవ్వాలి ? ఛానెల్ అండ్ గ్రూప్ కి మధ్య తేడా ఏంటంటే ?
భారతదేశంలో వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను ప్రారంభించిన వెంటనే చాలా మంది భారతీయ ప్రముఖులు, కంపెనీలు వాట్సాప్ ఛానెల్‌ని క్రియేట్ చేసాయి, ఇండియాలో వాట్సాప్ యాప్‌లోని ఛానెల్స్ ఫీచర్‌ను మెటా కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ముఖ్యమైన మెసేజెస్ ప్రైవేట్‌గా పొందే ఫెసిలిటీ అందిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా సంస్థలు సమాచారాన్ని షేర్ చేసేందుకు WhatsApp ఛానెల్స్ ఒక మార్గాన్ని అందిస్తాయి.
ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన తర్వాత, చాలా మంది ప్రముఖులు కూడా వాట్సాప్ ఛానెల్‌లో చేరారు. భారత క్రికెట్ టీం, ప్రధాని మోదీతో పాటు పలువురు వాట్సాప్ చానెళ్లను ప్రారంభించారు.
"వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం సంతోషంగా ఉంది! నిరంతర కమ్యూనికేషన్ ప్రయాణంలో మరింత దగ్గరయ్యేందుకు ఈ ఫీచర్ ఒక ముందు అడుగు. లెట్స్ స్తే కనెక్టెడ్ ! కొత్త పార్లమెంట్ భవనం నుండి ఒక ఫోటో ఇక్కడ ఉంది..." అంటూ వాట్సాప్ ఛానెల్ మొదటి పోస్ట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వాట్సాప్ యూజర్లు వారికీ ఇష్టమైన ఛానెల్‌ను సెలెక్ట్ చేసుకొని ఫాలో కావొచ్చు. ఛానెల్‌లో పబ్లిష్ చేసిన పోస్ట్‌లు WhatsApp అప్ డేట్స్ సెక్షన్ లో ఉంటాయి. ఛానెల్‌లో కొత్త పోస్ట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంది.
వాట్సాప్ ఛానెల్ అండ్ వాట్సాప్ గ్రూప్ మధ్య ముఖ్యమైన తేడా కూడా ఉంది. ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా అందులో మీకంటే ముందే ఉన్న ఇతర గ్రూప్ మెంబర్స్ తో చాట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. అయితే, ఛానెల్ ప్రారంభించిన వ్యక్తి మాత్రమే ఛానెల్‌లో పోస్ట్స్ చేస్తాడు. ఛానెల్‌ని ఫాలో చేసే ఎవరైనా ఫ్రీ టైంలో ఆ పోస్ట్‌లను చూడవచ్చు ఇంకా చదవవచ్చు.
WhatsApp ఛానెల్‌లో ఎలా చేరాలి?
ముందుగా వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ సెక్షన్ పక్కన ఉన్న అప్‌డేట్స్ సెక్షన్ లోకి వెళ్లండి. ఇక్కడ కింద మీకు నచ్చిన ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ఛానెల్ ఫాలో బటన్‌ను క్లిక్ చేయండి.