కొత్త కొత్తవారితో ఫ్రెండ్ షిప్, చాటింగ్, వీడియో కాల్స్ కూడా..; ఏళ్ల తర్వాత Omegle గుడ్ బై.. కారణం ఇదే.. ?
ప్రముఖ ఆన్‌లైన్ చాటింగ్ ప్లాట్‌ఫారమ్ Omegle 14 సంవత్సరాల తర్వాత మూసివేయబడింది. ఓమెగల్ వ్యవస్థాపకుడు లీఫ్ కె. బ్రూక్స్ మాట్లాడుతూ వెబ్‌సైట్ ఖర్చులు, ఒక గ్రూప్ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Omegle 2009లో లీఫ్ కె. బ్రూక్స్ ద్వారా ప్రారంభించబడింది. అది కూడా అతని 18 ఏళ్ల వయసులో. ఆ సమయంలో Omegle వ్యక్తిగత సమాచారాన్ని అందించకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని వ్యక్తుల మధ్య వీడియో చాట్‌ను సులభతరం చేయడంతో విస్తృతంగా ఉపయోగపడింది. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పుడు ఒమెగల్ వాడే వారి సంఖ్య పెరిగింది. ఇంకా మీ ఇంట్రెస్ట్స్ కి అనుగుణంగా, మీరు మెసేజ్ చేయడానికి ఇంకా తెలియని వారితో వీడియో కాల్ చేయడానికి కూడా అప్షన్ ఉంది. తరువాత Omegle ఒకే ఇంట్రెస్ట్స్ ఉన్న వ్యక్తులను కనుగొని కనెక్ట్ చేస్తుంది.
తర్వాత చాలా మంది ఈ ఫీచర్ ని దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. అసభ్యకర చాటింగ్ ఇంకా న్యూడిటీ ప్రదర్శన వంటి దుర్వినియోగం చాలా సంవత్సరాలుగా Omegleలో పెరుగుతున్నాయి. దింతో ఇతర ఫ్లాట్ ఫార్మ్ నుండి విస్తృత విమర్శలకు దారితీసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించేందుకు యంత్రాంగాలు ఏర్పాటు చేసినా అవి అంతంతమాత్రంగానే. ఆ సమయంలోనే Omegle వ్యవస్థాపకుడు లీఫ్ కె. బ్రూక్స్ Omegle కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.