Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • భారీ డిస్కౌంట్స్.. బంపర్ ఆఫర్స్ తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే..?

భారీ డిస్కౌంట్స్.. బంపర్ ఆఫర్స్ తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే..?

వినాయక చవితి ఫెస్టివల్ అఫర్ అయిపోయిందని బాధపడకండి. దసరా పండుగ సమీపిస్తుండటంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా డిస్కౌంట్ సేల్  తీసుకొస్తున్నాయి. అయితే ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ గురించి వివరాలను వెల్లడించేంచింది.
 

Ashok Kumar | Published : Sep 28 2023, 04:28 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

పండుగ సీజన్ ఉత్సాహంతో  ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సేల్ ఈవెంట్ “ది బిగ్ బిలియన్ డేస్” అక్టోబర్ 8 నుండి ప్రారంభమవుతుందని వెల్లడించింది. అయితే అక్టోబర్ 8 నుంచి 15 వరకు ఈ సేల్ జరగనుంది. 
 

24
Asianet Image

ఈ వారం ప్రారంభంలో అమెజాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) అక్టోబర్ 10 నుండి  ఉంటుందని వెల్లడించింది,  ఇప్పుడు Flipkart  కూడా సేల్ తేదీని ప్రకటించింది. అలాగే ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చింది, దీని ద్వారా  కస్టమర్లకు  సెలెక్ట్ చేసిన ఉత్పత్తులపై ఎక్స్ట్రా డిస్కౌంట్స్, సేల్  ప్రీ యాక్సెస్ అండ్  SuperCoin క్యాష్‌బ్యాక్‌తో సహా మరిన్ని బెనిఫిట్స్  అందిస్తుంది.
 

34
Asianet Image

ఈ ఏడాది  సేల్  సీజన్‌లో కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్  చైన్ బలోపేతం చేయడానికి 1 లక్ష డైరెక్ట్  అండ్ ఇన్ డైరెక్ట్  ఉద్యోగాలను సృష్టిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ కొనుగోలుదారులు ఈ సేల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, మీరు ఇక్కడ తక్కువ ధరలో ఐఫోన్లను పొందవచ్చు. గత సంవత్సరం Apple iPhone 13 భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం iPhone 13 తో పాటు iPhone 14 కూడా అద్భుతమైన తగ్గింపుతో లభిస్తోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమైనప్పటికీ ఇకామర్స్ ప్లాట్‌ఫాం డీల్ ధరలను వెల్లడించడం ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్ డిస్కౌంట్ కూడా అక్టోబర్ 1న  సైట్‌లో వెల్లడించనున్న సంగతి తెలిసిందే.
 

44
Asianet Image

Flipkart 2023 బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం  చేసుకుంది. అంటే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు అన్యువల్ సేల్  సమయంలో 10% ఇన్స్టంట్ తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా సెలెక్ట్ చేసిన బ్యాంకులపై  రూ.1,500 వరకు   ఇన్స్టంట్  డిస్కౌంట్ ఉంటుంది. 

అలాగే Paytm వినియోగదారులు UPI అండ్ వాలెట్ ట్రాన్సక్షన్స్ పై గ్యారెంటీ  సేవింగ్స్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సాధారణంగా ఎలక్ట్రానిక్స్ అండ్   ఆక్సెస్లోరిస్ పై 50-80% డిస్కౌంట్  ఉంటుంది. మీరు మొబైల్, ల్యాప్‌టాప్, ఆడియో ఆక్సెసరీ, బొమ్మలు, లైఫ్ స్టయిల్, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్ ఇంకా మరిన్ని ఉత్పత్తులపై ఆఫర్‌ పొందుతారు.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories