అమెజాన్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్-4 స్మార్ట్ వాచ్ ఇదే.. దీని ఫీచర్స్ తెలుసా ?
భారతదేశంలో స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు , స్మార్ట్ గాడ్జెట్ల మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి వారం కొన్ని బ్రాండ్లు స్మార్ట్ డివైజెస్ ని భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, స్మార్ట్ డివైజెస్ పరంగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి.
ఇటువంటి పరిస్థితిలో చాలా కంపెనీలు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్లను విడుదల చేస్తున్నాయి. వీటిలో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ మూడు నెలల క్రితం భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ వాచ్ అమెజాన్ టాప్ -4 స్మార్ట్ వాచ్ జాబితాలో చేరింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా పేర్కొంది.
ఫైర్-బోల్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్
ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ బిఐటి సెన్సార్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కోసం ఒక SpO2 సెన్సార్ కూడా ఉంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ వాచ్ లో రక్తపోటు మానిటర్ కూడా ఉంది, ఈ ఫీచర్ చాలా స్మార్ట్ వాచ్లలో అందుబాటులో లేదు. ఈ వాచ్ మెటల్ బాడీ, ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ వాచ్ కి 1.4-అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్, హెచ్‌డి కలర్ డిస్ ప్లే ఉంది. ఈ వాచ్ పట్టీని సులభంగా తొలగించవచ్చు అలాగే జతచేయవచ్చు. రన్నింగ్, వాకింగ్, స్కిప్పింగ్ వంటి చాలా ఫీచర్లు దీనిలో ఉన్నాయి. దీనిలో స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంది. ఈ వాచ్ ద్వారా ఫోన్ కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఫోన్‌లో వచ్చే అన్ని నోటిఫికేషన్‌లు ఈ వాచ్‌లో చూడవచ్చు.
దీని బ్యాటరీ లైఫ్ 60 గంటల స్టాండ్‌బైగా కంపెనీ పేర్కొంది. దీనిలో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కూడా అందించారు. ఈ వాచ్ బోల్ట్ ప్లే యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఈ వాచ్ వాటర్, డస్ట్‌ప్రూఫ్ కోసం IPX7 గా రేట్ చేయబడింది. ఈ వాచ్ ధర ఋ.5,999 అయితే దీనిని ప్రస్తుతం రూ .2,999కే కొనుగోలు చేయవచ్చు.