ఫేస్ బుక్ కొత్త సేఫ్టీ ఫీచర్లు: భారతదేశ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా.. ఇక వాటికి చెక్..
సోషల్ మీడియా దిగ్గజం మెటా (meta)గా పెరుమారిన ఫేస్ బుక్ (facebook) సంస్థ భారతదేశం మహిళల భద్రత(women safety) కోసం ఎన్నో భద్రతా ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు మెటా StopNCII.orgని ప్రారంభించినట్లు ప్రకటించింది, దీని ముఖ్య ఉద్దేశం సెన్సిటివ్ ఫోటోలు (sensitive content)వైరల్‌గా మారకుండా ఆపడం లక్ష్యంగా పెట్టుకుంది.
అంతేకాకుండా మెటా ఉమెన్ సేఫ్టీ హబ్‌ని కూడా పరిచయం చేసింది, అంటే ఇప్పుడు ఈ ఫీచర్ హిందీతో సహా 11 ఇతర భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. సేఫ్టీ హబ్‌లో ఫేస్‌బుక్‌లో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై మహిళలకు చిట్కాలు అందిస్తుంది. దీని కోసం వారు ఎన్నో స్పెషల్ టూల్స్ కూడా పొందుతారు. మెటా ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్ (global security policy) కరుణా నైన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెటా ఈ చొరవ మహిళలకు ఎటువంటి భాషా సమస్యలను ఎదుర్కోకుండా చూస్తుందని అన్నారు.
"మా అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని సృష్టించడానికి అలాగే అందించడానికి మెటా నిబద్ధతలో వినియోగదారుల భద్రత అంతర్భాగంగా ఉంది అలాగే కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ఆన్‌లైన్ వినియోగదారులను రక్షించడానికి ఎన్నో రకాల టూల్స్ పరిచయం చేసింది. భవిష్యత్తులో మేము వినియోగదారులను రక్షించడానికి ఆన్‌లైన్ టూల్స్ పరిచయం చేస్తాము అని అన్నారు.
మహిళలకు ప్రత్యేకం
StopNCII.orgకి సంబంధించి కరుణ నైన్ మాట్లాడుతూ ఈ ప్లాట్‌ఫారమ్ ముఖ్య ఉద్దేశ్యం ఒకరి ఫోటోలు వైరల్ కాకుండా అలాగే ఎలాంటి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని నిరోధించడమేనని చెప్పారు. ఈ ప్లాట్‌ఫారమ్ బాధితులకు ఫిర్యాదులు చేయగల టూల్స్ అందిస్తుంది అని అన్నారు.
ఫిర్యాదు చేస్తే ఈ ప్లాట్‌ఫారమ్ ఫిర్యాదుదారుడి ఫోటోలు లేదా సమాచారం తీసుకోదని అయితే వివాదాస్పద పోస్ట్‌పై యునిక్ ఐడి ద్వారా చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫోటోను అప్‌లోడ్ చేసిన వెంటనే ఫేస్‌బుక్ ఆటోమేటిక్ టూల్స్ దానిని స్కాన్ చేస్తాయి. మెటా ప్లాట్‌ఫారమ్‌లో మహిళల భద్రతను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ రీసెర్చ్ (CSR), రెడ్ డాట్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుంది.
మెటా ప్రకారం భారతదేశంలో 33 శాతం మంది మహిళలు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు, అయితే పురుషులు ఉపయోగించే వారి సంఖ్య 67 శాతంగా ఉంది. మహిళలు సోషల్ మీడియాలోకి రాకపోవడానికి ప్రధాన కారణం భద్రత. అలాగే వారి ఫోటోలు దుర్వినియోగం అవుతాయనే భయం వారికి ఎప్పుడూ ఉండేది అని తెలిపింది.