MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • ChatGPT : మీరు ఇక ఏఐతో మాట్లాడొచ్చు... చాట్‌జిపిటి వాయిస్ చాట్ సెట్టింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్

ChatGPT : మీరు ఇక ఏఐతో మాట్లాడొచ్చు... చాట్‌జిపిటి వాయిస్ చాట్ సెట్టింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్

ChatGPT : చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి… ఏఐతో మాట్లాడటానికి సెట్టింగ్స్‌ను ఎలా మార్చాలో తెలుసుకోండి. మీరు కూడా ఇక టైపింగ్ కు గుడ్ బై చెప్పి మాటలతోనే సమాధానం పొందండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 06 2025, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చాట్ జిపిటి వాయిస్
Image Credit : Gemini

చాట్ జిపిటి వాయిస్

చాట్‌జిపిటి… మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. టైపింగ్ చేయడం కంటే మీ వాయిస్‌ని ఉపయోగించి సమాధానాలు పొందే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది ఓ మేధావితో నిజంగా మాట్లాడి సరైన సమాధానం పొందినట్లు అనుభూతిని ఇస్తుంది. ఇలా చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌తో యూజర్లు నేరుగా AIతో మాట్లాడొచ్చు. ఇది చాలా సహజమైన, అడ్డంకులు లేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలో, వాయిస్ స్పష్టంగా ఉండటానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మీ మాటలకు ఏఐ సమాధానం
Image Credit : Getty

మీ మాటలకు ఏఐ సమాధానం

చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్ టైప్ చేయడం కాకుండా ఏఐతో నేరుగా మాట్లాడటానికి సాయపడుతుంది. టైప్ చేయడంద్వారా సమాధానం పొందినట్లే మీరు మాట్లాడితే కూడా ఏఐ వెంటనే సమాధానం ఇస్తుంది. మీరు ఇతర పనులు చేస్తున్నప్పుడు, చేతులు బిజీగా ఉన్నప్పుడు లేదా సహజమైన అనుభవం కావాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పేది విని, అర్థం చేసుకుని ఏఐ కచ్చితమైన సమాధానాలు ఇస్తుంది.

Related Articles

Related image1
ChatGPT : ఏఐ ఉపయోగించి రూ.1,32,00,000 సంపాదించిన మహిళ... ఎలాగో తెలుసా?
Related image2
భార‌త్‌లో ఆఫీస్ తెరుస్తోన్న ChatGPT.. పెద్ద ప్లానే.
36
చాట్ జిపిటి వాయిస్ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ గైడ్
Image Credit : Getty

చాట్ జిపిటి వాయిస్ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ గైడ్

హ్యాండ్స్-ఫ్రీ సహాయం కోసం చాట్‌జిపిటి వాయిస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసా? దీన్ని ఎనేబుల్ చేయడం చాలా సులభం. దానికోసం సింపుల్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి.

1. చాట్‌జిపిటి యాప్ ఓపెన్ చేయండి : వాయిస్ చాట్ కోసం చాట్‌జిపిటి యాప్‌ను తెరవండి.

2. సెట్టింగ్స్‌కు వెళ్లండి: సెట్టింగ్స్‌లో 'వాయిస్' లేదా 'స్పీచ్' ఆప్షన్‌ను కనుగొనండి.

3. మైక్రోఫోన్ యాక్సెస్ అనుమతించండి: చాట్‌జిపిటి యాప్ మీ మైక్రోఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతించండి.

4. వాయిస్‌ను ఎంచుకోండి (ఆప్షనల్): కొన్ని వెర్షన్లలో మీరు AI వాయిస్ లేదా భాషను ఎంచుకోవచ్చు.

5. మాట్లాడటం ప్రారంభించండి: మైక్ ఐకాన్‌పై నొక్కి మాట్లాడటం మొదలుపెడితే ఏఐ వెంటనే స్పందిస్తుంది.

46
ఏఐతో మాట్లాడున్నారా..? ఖచ్చితమైన సమాధానం కోసం చిట్కాలు
Image Credit : Getty

ఏఐతో మాట్లాడున్నారా..? ఖచ్చితమైన సమాధానం కోసం చిట్కాలు

AIతో మాట్లాడేటప్పుడు ఖచ్చితమైన సమాధానాల కోసం కొన్ని చిట్కాలు 

• స్పష్టంగా మాట్లాడండి.

• వాఖ్యాలను చిన్నగా ఉండేలా చూడండి

• వాఖ్యాల మధ్య విరామం ఇవ్వండి.

• బ్యాక్‌గ్రౌండ్ శబ్దం లేకుండా చూసుకోండి.

56
ChatGPT వాయిస్ ఉపయోగాలు
Image Credit : Getty

ChatGPT వాయిస్ ఉపయోగాలు

చాట్‌జిపిటితో వాయిస్ ఉపయోగించడం టైపింగ్ కంటే వేగవంతమైనదే కాదు చాలా సౌకర్యవంతమైనది కూడా. వంట చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా చేతులు బిజీగా ఉన్నప్పుడు దీన్ని వాడొచ్చు. టైప్ చేయడం లేదా స్క్రీన్ చూడటం కష్టంగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది రోబోతో కాకుండా, నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్న అనుభూతిని ఇస్తుంది.

66
చాట్‌జిపిటి వాయిస్‌తో మీరు చేయగల పనులు
Image Credit : Getty

చాట్‌జిపిటి వాయిస్‌తో మీరు చేయగల పనులు

• త్వరిత ప్రశ్నలు: వాతావరణం, గణితం వంటి ప్రశ్నలు అడగవచ్చు.

• టైపింగ్‌కు బదులుగా: ఇమెయిల్‌లు, రిపోర్ట్‌లు మాట్లాడి రాయించవచ్చు.

• భాషా నైపుణ్యం: AIతో మాట్లాడి భాషను మెరుగుపరచుకోవచ్చు.

• కంటెంట్ క్రియేషన్: ఆలోచనలు, స్క్రిప్ట్‌లు వేగంగా సృష్టించవచ్చు.

• పనుల నిర్వహణ: రిమైండర్‌లు సెట్ చేయవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
ChatGPT : ఏఐ ఉపయోగించి రూ.1,32,00,000 సంపాదించిన మహిళ... ఎలాగో తెలుసా?
Recommended image2
భార‌త్‌లో ఆఫీస్ తెరుస్తోన్న ChatGPT.. పెద్ద ప్లానే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved