Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • బంగారు పూత, వజ్రాలు పొదిగిన ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఐఫోన్‌ ఉపయోగిస్తున్న నీతా అంబానీ..? ఇందులో నిజం ఏంటి..

బంగారు పూత, వజ్రాలు పొదిగిన ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఐఫోన్‌ ఉపయోగిస్తున్న నీతా అంబానీ..? ఇందులో నిజం ఏంటి..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ లగ్జరీ  లైఫ్ స్టయిల్ కి ప్రసిద్ధి. ఆమె దగ్గర  ఎంతో విలువ చేసే చీరలు, హ్యాండ్‌బ్యాగులు, ఆక్సెసోరిస్ ఉన్నాయి. దీనికి తోడు నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు ప్రచారం...  అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది ?  

Ashok Kumar | Published : Oct 10 2023, 01:39 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

అత్యంత విలాసవంతమైన లైఫ్ స్టయిల్ ఆస్వాదించే బిలియనీర్ ముఖేష్ అంబానీ అతని భార్య నీతా అంబానీ ప్రపంచంలోని అత్యంత రిచ్  బిజినెస్ కపుల్స్ లో ఒకరు. భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇంట్లో నివసించడమే కాకుండా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి.

25
Asianet Image

నివేదికల ప్రకారం, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాపిల్ ఐఫోన్. బంగారం పూతతో  ఈ ఐఫోన్‌పై వజ్రాలు పొదిగినట్లు సమాచారం.

35
Asianet Image

నీతా అంబానీ ఫోన్ ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ మొబైల్ అని గతంలో పలు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫోన్ విలువ 48.5 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ. 403 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి. 

45
Asianet Image

ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ అనేది కంపెనీ ఫాల్కన్ సూపర్‌నోవా ద్వారా కస్టమ్-బిల్ట్ చేసిన అత్యంత ఖరీదైన ఐఫోన్. ఈ ఫోన్ 24-క్యారెట్ బంగారం ఇంకా  ప్లాటినం  పొరతో పూసిన స్టాండర్డ్  ఐఫోన్ 6.
 

55
Asianet Image

అంతే కాదు, గోల్డ్ ఐఫోన్ వెనుక భాగంలో భారీ పింక్ డైమండ్ పొందుపరచబడింది. దింతో ఫోన్ మరింత ఆకర్షణీయంగా అలాగే  కాస్ట్లీ గా  కనిపిస్తుంది.

నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించడం లేదని, ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ పింక్ డైమండ్   అనేది పుకార్లు, అబద్ధం అని  కొన్నాళ్ల క్రితం రిలయన్స్‌ వర్గాలు ధృవీకరించాయి. 

ప్రస్తుతం నీతా అంబానీ ఏ ఫోన్‌ని ఉపయోగిస్తుందో  వెల్లడించలేదు, అయితే ఆమె ఐఫోన్  లేటెస్ట్  అండ్  అప్ డేటేడ్ వెర్షన్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు.  
 

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories