డిఎస్‌ఎల్‌ఆర్ వంటి కెమెరాతో ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. సోని IMX709 సెన్సార్‌తో ప్రపంచంలోనే మొదటి ఫోన్..
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 7(oppo reno 7) భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది, అయితే ఈ సిరీస్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 7 5జి, ఒప్పో రెనో 7 ప్రొ 5జి, ఒప్పో రెనో 7ఎస్‌ఈ 5జి స్మార్ట్‌ఫోన్‌లు గత సంవత్సరం చైనాలో లాంచ్ అయ్యాయి. కొద్దిరోజుల క్రితం ఒప్పో రెనో 7 సిరీస్ భారతీయ ధర లీక్ అయ్యింది. ఒప్పో రెనో 7 సిరీస్ డిజైన్ ఐఫోన్ 13 (iPhone 13) సిరీస్‌ని పోలి ఉంటుంది. ఒప్పో రెనో 7 సిరీస్ సెల్ ఫ్లిప్ కర్ట్ (Flipkart) ద్వారా జరగనుంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ఒప్పో రెనో 7 సిరీస్ ఫోన్‌లు Sony IMX709 (32-మెగాపిక్సెల్) సెన్సార్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి ఫోన్‌లు అవుతాయని ఒప్పో పేర్కొంది.
ఒప్పో రెనో 7 సిరీస్ కోసం కంపెనీ #ThePortraitExpert క్యాంపైన్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. భారతదేశంలో ఒప్పో రెనో 7 సిరీస్ ప్రారంభ ధర రూ. 28,000.
ఒప్పో రెనో 7 5జి స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 7 5జిలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 12 ఉంది. ఇది కాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 12జిబి వరకు LPDDR4x ర్యామ్,256 జిబి వరకు స్టోరేజ్ ఉంది. ఇంకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్.
రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ సోనీ IMX709 సెన్సార్ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC అండ్ USB టైప్-సి పోర్ట్ లభిస్తాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500mAh బ్యాటరీ ఉంది.