MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Top 5 Smartwatches 2026 : పండగ సీజన్లో స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో దుమ్ములేపుతున్న టాప్ 5 వాచీలివే

Top 5 Smartwatches 2026 : పండగ సీజన్లో స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో దుమ్ములేపుతున్న టాప్ 5 వాచీలివే

ఇండియాలో శాంసంగ్ అందిస్తున్న టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఏవి? వాటి ఫీచర్లు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 13 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా
Image Credit : X

శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా

డిజైన్, బిల్డ్ క్వాలిటీ : గ్రేడ్-4 టైటానియం బాడీ, సఫైర్ క్రిస్టల్ గ్లాస్‌తో ఈ వాచ్‌ను చాలా స్ట్రాంగ్‌గా తయారు చేశారు. 10 ATM వాటర్ రెసిస్టెన్స్, EN13319 డైవింగ్ సర్టిఫికేషన్ ఉండటంతో స్పోర్ట్స్ ఆడేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్.

డిస్‌ప్లే : స్మార్ట్‌వాచ్‌లలోనే అత్యంత ప్రకాశవంతమైన 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 1.52-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.

పెర్ఫార్మెన్స్, బ్యాటరీ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్ ప్రాసెసర్, 2GB ర్యామ్‌తో ఇది పనిచేస్తుంది. 800mAh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 80 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.

స్పెషల్ ఫీచర్లు : డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, 86 డెసిబెల్స్ సౌండ్ ఇచ్చే ఎమర్జెన్సీ సైరన్, ఫాల్ డిటెక్షన్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శాంసంగ్ వాచ్ 9
Image Credit : X

శాంసంగ్ వాచ్ 9

వాడకం - మన రోజువారీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

పెర్ఫార్మెన్స్, బ్యాటరీ - స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్ ప్లాట్‌ఫామ్‌తో పనిచేయడం వల్ల ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. పాత మోడల్స్ కంటే ఇందులో ఉన్న 390mAh బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది.

హెల్త్ ట్రాకింగ్ - నిద్రపోతున్నప్పుడు హార్ట్ రేట్, రక్తంలో ఆక్సిజన్ (SpO2), స్కిన్ టెంపరేచర్, బ్రీతింగ్ రేట్ లాంటివి ట్రాక్ చేసే 'Vitals' ఫీచర్ ఇందులో ఉంది.

AI, వాయిస్ కంట్రోల్ - గూగుల్ జెమినీ సపోర్ట్ ఉండటంతో, ఫోన్ ముట్టుకోకుండానే వాయిస్ కమాండ్స్‌తో చాలా పనులు ఈజీగా చేసుకోవచ్చు.

35
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్
Image Credit : X

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్

డిజైన్ - శాంసంగ్ వాచీలకే ప్రత్యేకమైన రొటేటింగ్ బెజెల్ డిజైన్‌తో ఈ వాచ్ వస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది.

ఫీచర్లు - ఈ రొటేటింగ్ బెజెల్ సాయంతో వాచ్‌ను చాలా ఈజీగా వాడొచ్చు. AI ఫిట్‌నెస్ గైడెన్స్, రెండు రోజులకు పైగా వచ్చే బ్యాటరీ బ్యాకప్ దీని సొంతం.

45
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8
Image Credit : X

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8

వాడకం - చాలా తక్కువ బరువు, స్లిమ్ డిజైన్ ఉండటం వల్ల ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకి, వర్కవుట్స్ చేసేవాళ్లకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

ఫీచర్లు - మల్టీ-స్పోర్ట్ ట్రాకింగ్, కచ్చితమైన హార్ట్ రేట్ సెన్సార్, స్మార్ట్ నోటిఫికేషన్స్ లాంటి రోజువారీ అవసరాలకు తగ్గ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

55
శాంసంగ్ వాచ్ FE
Image Credit : X

శాంసంగ్ వాచ్ FE

బడ్జెట్ ఫ్రెండ్లీ - తక్కువ ధరలో శాంసంగ్ వాచ్ ఫీచర్లు, హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే వాళ్ల కోసం తీసుకొచ్చిన బెస్ట్ బడ్జెట్ మోడల్ ఇది.

ఫీచర్లు - రోజువారీ ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ లాంటి ఫీచర్లతో పాటు స్టైలిష్ లుక్‌ను ఈ వాచ్ అందిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
whatsapp new feature: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్..ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా షేర్ చేయొచ్చు
Recommended image2
Recharge Plans : రూ.200 కే 18+ ఓటీటీలు, యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ.. అదిరిపోయే రీచార్జ్ ప్లాన్
Recommended image3
Vivo V80 Review: అదిరిపోయే కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ.. కానీ రూ. 63 వేల ధరతో వీవో V80 కొనొచ్చా?
Related Stories
Recommended image1
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?
Recommended image2
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved