రూ.10 వేలలోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ కావాలా.. ఫుల్ లిస్ట్ ఇదిగో!
తక్కువ ధర, మంచి ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, 5జి అప్షన్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే మార్కెట్లో 10వేలలోపు బెస్ట్ 5G మొబైల్స్ ఏవి ? వాటి ధరలు, ఫీచర్లు ఏమిటో తెలుసుకోండి...
Redmi 13C 600×720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 450 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ MediaTek Helio G85 చిప్‌సెట్ Redmi 13Cకి శక్తినిస్తుంది, అయితే Mali-G57 MP2 GPU మల్టీ-టాస్కింగ్‌కి సహాయపడుతుంది.
Poco M6 Pro 5G 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 3 స్మార్ట్‌ఫోన్‌కి ఇచ్చారు. Qualcomm Snapdragon 4 Gen 2 SoC ద్వారా, ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14తో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50MP AI సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
Realme C53 6.74-అంగుళాల 90Hz డిస్‌ప్లేతో 560 నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ అందించే స్క్రీన్, ARM Mali-G57 GPUతో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 108MP అల్ట్రా-క్లియర్ కెమెరాను పొందుతుంది. 720P/30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో 8MP AI సెల్ఫీ కెమెరా ద్వారా సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ చేయవచ్చు.
లావా బ్లేజ్ 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే, డిస్ప్లే వాటర్ డ్రాప్-నాచ్‌తో ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 700 SoC బ్లేజ్ 5Gకి శక్తినిస్తుంది. మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో రన్ అవుతుంది, ఇంకా క్లీన్ UIని అందిస్తుంది.
Samsung Galaxy M13 1080 x 2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల FHD+ LCD ఇన్ఫినిటీ O డిస్‌ప్లే దినికి ఉంది. వన్ UI ఆధారంగా Android 12తో ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే, ముందు భాగంలో f/2.2 ఎపర్చరుతో 8MP షూటర్ ఉంది. వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.