జాగ్రత్తగా! ఐఫోన్ నకిలీ వాట్సాప్.. పొరపాటున ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ కావచ్చు..

First Published Feb 6, 2021, 12:31 PM IST

ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాట్సాప్ వాడని వారు లేరు. అయితే తాజాగా వాట్సాప్  నకిలీ వెర్షన్ చాలా వైరల్ అవుతోంది. వాట్సాప్  ఈ నకిలీ వెర్షన్‌ను ఐఫోన్ కోసం ఇటాలియన్ నిఘా సంస్థ సై 4 గేట్ తయారు చేసినట్లు సమాచారం. ఐఫోన్ కోసం ప్రారంభించిన ఈ వాట్సాప్ యాప్ వినియోగదారుల ఫోన్‌ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తుందని  ఇంకా మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరవేస్తుందని ఒక నివేదిక తెలిపింది.