మిలిటరీ స్టాండర్డ్ తో బిజినెస్ కోసం ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్.. దీని ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..
ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ తైవాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9(2021)ల్యాప్‌టాప్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9 ప్రత్యేకంగా బిజినెస్ కోసం రూపొందించారు.
దీని డిజైన్ కఠినమైనది ఎందుకంటే అమెరికన్ మిలిటరీ స్టాండర్డ్ పదార్థం దీని తయారీలో ఉపయోగించారు. ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9లో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అందించారు.
ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9(2021) ధర అండ్ స్పెసిఫికేషన్స్
ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9(2021) ధర రూ .1,15,498. దీని సేల్స్ ఆసుస్ స్టోర్స్ ఇంకా ఇతర రిటైల్ స్టోర్ల నుండి త్వరలో ప్రారంభమవుతాయి.అయితే ఇండియాలో ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9 2020ను రూ .1,02,228 కు లాంచ్ చేసింది.
ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9(2021) లో విండోస్ 10 ప్రో లేదా విండోస్ 10 హోమ్ లభిస్తుంది. దీనికి 14 అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే, 1920x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 400 నిట్స్.
దీనిలో 11వ ఇంటెల్ కోర్ i5-1135G7, ఇంటెల్ కోర్ i7-1165G7 ప్రాసెసర్ ఉంది. ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఎక్స్ గ్రాఫిక్స్, 8 జిబి అండ్ 16 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ ఉన్నాయి. ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి9 (2021)లో డ్యూయల్ M.2 NVMe PCI 3.0, 2టిబి స్టోరేజ్ ఇచ్చారు.
ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ బి 9(2021) లో థండర్ బోల్ట్ 4, యుఎస్‌బి 3.2 జెన్ 2 టైప్-ఎ, హెచ్‌డిఎంఐ పోర్ట్, ఆడియో కాంబో జాక్, వై-ఫై 6, బ్లూటూత్ వి5 ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ MIL-STD 810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌ను ఆమోదించింది. దీని బరువు 1.005 కిలోలు.
ఈ ల్యాప్‌టాప్ లో హార్మోన్ కార్డాన్ స్పీకర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇంటర్నల్ అమెజాన్ అలెక్సాకు సపోర్ట్ కూడా ఉంది. భద్రత కోసం వేలిముద్ర సెన్సార్, వెబ్‌క్యామ్ బయోమెట్రిక్ లాగిన్ అందించారు. దీనిలో 66Wh లిథియం పాలిమర్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఫుల్ చార్జ్ తో ఒకరోజు మొత్తం బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. 65Wటైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బ్యాటరీతో సపోర్ట్ చేస్తుంది.