- Home
- Technology
- దీపావళికి కొత్త ఫోన్ కొనబోతున్నారా.. ఒక్క నిమిషం ఆగండి.. నవంబర్‌లో రాబోతున్న హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..
దీపావళికి కొత్త ఫోన్ కొనబోతున్నారా.. ఒక్క నిమిషం ఆగండి.. నవంబర్‌లో రాబోతున్న హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..
దసరా పండగ తరువాత ఇప్పుడు దీపావళి పండుగ రాబోతుంది. ఈ ఫెస్టివల్ సీజన్లో చాల కంపెనీలు, ఈ కామర్స్ సైట్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. మీరు కూడా 5జికి అప్ గ్రేడ్ అయ్యేందుకు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా... అయితే ఈ నెలలో లాంచ్ కానున్న కొన్న్ని స్మార్ట్ ఫోన్స్ గురించి మీకోసం...

ఈ నవంబర్ నెలలో చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. వీటిలో వన్ ప్లస్ నుండి వివో, టెక్నో, హానర్ బ్రాండ్ల వరకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి.
OnePlus 12 5G - OnePlus రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వివరాలను ఇంకా ధృవీకరించలేదు. అయితే, వన్ ప్లస్ 12 5జి AnTuTu ఇంకా ఇతర వెరిఫైడ్ వెబ్‌సైట్‌లలో కనిపిస్తుంది. OnePlus 12 5G నిస్సందేహంగా Snapdragon 8 Gen 3 SoCతో వస్తుంది. OnePlus కంపెనీ OnePlus 12R లేదా OnePlus Ace 3ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
Vivo X100 సిరీస్ - చైనాలో Vivo X100 సిరీస్ లాంచ్ తేదీ నవంబర్ 17న కన్ఫర్మ్ చేసారు. Vivo X100 అండ్ Vivo X100 Pro నవంబర్ 6న మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoCతో వస్తుందని భావిస్తున్నారు, అయితే Vivo X100 Pro+ స్నాప్‌డ్రాగన్ 8 Genతో ఉంటుంది.
iQOO 12 సిరీస్ - ఈ OEMలలో ప్రధానమైనది Vivo సబ్-బ్రాండ్ iQOO. iQOO 12 సిరీస్ నవంబర్ 7న చైనాలో లాంచ్ కానుంది. అలాగే, iQOO 12 సిరీస్ భారతదేశంలోని మొదటి Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 స్మార్ట్‌ఫోన్ అని బ్రాండ్ ధృవీకరించింది.
Realme GT 5 Pro - Realme ఇప్పటికే Snapdragon 8 Gen 3 SoCతో GT సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసినట్లు ధృవీకరించింది. Realme GT 5 Pro టెలిఫోటో-పెరిస్కోప్ లెన్స్‌తో ఫినిష్ చేసిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
టెక్నో పాప్ 8 - ఈ నెలలో భారతదేశంలోకి రానున్న మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ 8. Tenko Pop 8 ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. టెక్నో పాప్ 8 భారతదేశంలోని ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో రూ. 6,999 ప్రారంభ ధరతో వస్తుందని భావిస్తున్నారు.
Vivo Y78 5G - Vivo Y78 5G ఇంకా ఇండియాలోకి రాలేదు. అయితే, పుకార్ల ప్రకారం Vivo Y78 5G నవంబర్ 2023లో ఇండియాలోకి వస్తుంది చెబుతున్నారు. అయితే Vivo దీని లాంచ్‌ను ఇంకా వెల్లడించలేదు.
హానర్ మ్యాజిక్ 6 - హానర్ మ్యాజిక్ 6 ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఇన్నోవేటివ్ AI- పవర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ క్యాప్సూల్ ఇంకా యోయో, స్మార్ట్ వర్చువల్ అసిస్టెంట్ ఉన్నాయి.
లావా ప్లేస్ 2 5G - లావా బ్లేజ్ 2 5G నవంబర్ 2న ఇండియాలో లాంచ్ అవుతుంది. Blaze 2 5G భారతదేశంలోని బడ్జెట్ విభాగంలో కంపెనీ ఇప్పటికే టీజ్ చేసిన డివైజ్ వివిధ ఫీచర్స్ తో వస్తుంది. భారతదేశంలో Lava Blaze 2 5G ధర రూ. 10,000 నుండి రూ. 13,000 మధ్య ఉంటుందని అంచనా.