ఆపిల్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు వీడియో కాల్స్ లో సినిమాలు, గేమ్స్ కూడా..
అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అపిల్(apple) ఎట్టకేలకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షేర్‌ప్లే(SharePlay) ఫీచర్‌ను విడుదల చేసింది. షేర్‌ప్లే ఐఓఎస్ 15.1, ఐపాడ్ ఓఎస్ 15.1తో అప్ డేట్ తో వస్తుంది. షేర్‌ప్లే సహాయంతో మీరు వీడియో కాల్స్ (video calls)ద్వారా మీ స్నేహితులతో సినిమాలు, మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు.
అంతేకాదు షేర్‌ప్లే సహాయంతో మీరు ఆపిల్ ఫేస్ టైమ్ (FaceTime) యాప్ నుండి గేమ్‌లు, మూవీస్ షేర్ చేయగలుగుతారు. షేర్‌ప్లేతో ఆపిల్ సంస్థ వీడియో కాలింగ్ యాప్‌లో మూవీస్ లేదా గేమ్ స్ట్రీమింగ్ సేవలను అందించే ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది.
ఆపిల్ల్ షేర్‌ప్లే ఆపిల్ టివి ప్లస్, మ్యూజిక్, ఫిట్ నెస్ ప్లస్ తో అందుబాటులో ఉంది, అంటే మీరు స్నేహితులతో వీడియోలు, క్లిప్‌లను షేర్ చీసుకోవచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా కరోనా కాలంలో వీడియో కాలింగ్ ట్రెండ్‌లో ఉంది. మీరు మ్యూజిక్ వింటూ లేదా ఫిట్‌నెస్ వీడియోను చూస్తున్నట్లయితే అలాగే దానిని మీ స్నేహితునితో కూడా షేర్ చేయాలని భావిస్తే షేర్‌ప్లే సహాయంతో మీరు దీన్ని సులభంగా షేర్ చేయవచ్చు.
షేర్‌ప్లే సహాయంతో మీరు ఫేస్ టైమ్ యాప్ ద్వారా ఎన్‌బిఏ గేమ్‌లు, ట్విచ్, టిక్‌టాక్, నైట్ స్కై మొదలైనవాటిని స్నేహితులతో పంచుకోవచ్చు. షేర్‌ప్లే సపోర్ట్ ఉన్న యాప్స్ జాబితా ఆపిల్ యాప్ స్టోర్‌లో కూడా విడుదల చేసింది.
షేర్‌ప్లేలో కొన్ని భారతీయ డెవలపర్‌ల యాప్‌లకు కూడా సపోర్ట్ ఉంది. వీటిలో మొదటి పేరు ఫుడ్ బుక్ రెసిపీస్ యాప్. ఈ యాప్ కృత్రిమ మేధస్సుకు సపోర్ట్ ఇచ్చే రెసిపీ యాప్. వివిధ రకాల వంటకాలు వాటిని ఎలా తయారు చేయాలో ఈ యాప్‌లో ఉంటుంది. పాటల రచన, ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్‌లు అయిన భారతీయ యాప్‌ల జాబితాలో రైమెలో, చరణా కూడా పేరు పొందాయి.