MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మరో చారిత్రక రికార్డ్ సృష్టించనున్న ఆపిల్.. జర్మనీ, యూ‌కే ఆర్థిక వ్యవస్థ కంటే..

మరో చారిత్రక రికార్డ్ సృష్టించనున్న ఆపిల్.. జర్మనీ, యూ‌కే ఆర్థిక వ్యవస్థ కంటే..

 ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్(apple) త్వరలో  ఒక పెద్ద రికార్డు సృష్టించబోతోంది. అవును.. నిజమే ఆపిల్ ఇప్పుడు 3 ట్రిలియన్ల మార్కెట్ విలువను కలిగి ఉన్న మొదటి కంపెనీగా అవతరించడానికి చాలా దగ్గరగా ఉంది. సోమవారం దీని షేర్ల పెరుగుదలతో స్టాక్ ధర $ 175.74 కు పెరిగింది. ఈ అప్‌ట్రెండ్‌తో ఆపిల్ ఇప్పుడు $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌ను చేరుకోవడానికి కేవలం 4 శాతం లాభం అవసరం.

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 14 2021, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

4 శాతం మాత్రమే 
ఒక నివేదిక ప్రకారం, Apple Inc. స్టాక్ లెవెల్ సోమవారం 175.74 డాలర్లకు చేరుకుంది. అయితే సోమవారం ముగింపు ధర నుండి 4 శాతం పెరిగితే, దాని ధర $ 182.86కి పెరుగుతుంది. ఇదే జరిగితే కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. నివేదిక ప్రకారం గత దశాబ్దంలో అద్భుతమైన పనితీరు తర్వాత, Apple Inc. మార్కెట్ విలువ సోమవారం $3 ట్రిలియన్లకు చేరువలో ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడం వల్ల యాపిల్ అటువంటి మార్కెట్ వాల్యుయేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఆపిల్ షేర్లలో పెరుగుదల
 ఆపిల్ షేర్ల పెరుగుదలను పరిశీలిస్తే, గత వారం దాని ధర సుమారు 11 శాతం పెరగగా, మరోవైపు వార్షిక ప్రాతిపదికన 30 శాతానికి పైగా లాభాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్వెస్టర్లకు కంపెనీపై పూర్తి విశ్వాసం ఉందని తేలింది. విశేషమేమిటంటే, ప్రపంచంలోని అత్యుత్తమ పనితీరు గల స్టాక్‌లలో ఒకటిగా దశాబ్దాలుగా పరిపాలించిన తర్వాత, iPhone తయారీదారు Apple Inc. మార్కెట్ విలువ $3 ట్రిలియన్లకు చేరుకొనుంది, అంటే జర్మనీ అండ్ యూ‌కే ఆర్థిక వ్యవస్థ మొత్తం మార్కెట్ కంటే పెద్దదిగా చేస్తుంది.
 

33

మార్కెట్ విలువను పెంచే ప్రయాణం 
యాపిల్ మార్కెట్ వాల్యుయేషన్ గురించి చెప్పాలంటే నాలుగేళ్ల క్రితం యాపిల్ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ తర్వాత 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. అదే సమయంలో $3 ట్రిలియన్ల లక్ష్యాన్ని సాధించడానికి చాలా వేగంగా దూసుకెళ్లింది   చివరకు కేవలం 16 నెలల్లోనే కంపెనీ మార్కెట్ విలువ $2 ట్రిలియన్ నుండి $3 ట్రిలియన్లకు చేరువైంది. కాబట్టి అతి త్వరలో ఈ లక్షాన్ని సాధించవచ్చని భావిస్తున్నారు. కేవలం 4 శాతం పెరుగుదల కంపెనీని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆంధ్ర ప్రదేశ్ లో జియో హవా.. ఏకంగా 3.29 కోట్లమంది ఈ నెట్ వర్క్ వాడుతున్నారా..!
Recommended image2
JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Recommended image3
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved