MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • షాకిచ్చిన అమెజాన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన యాప్స్, వెబ్‌సైట్లు

షాకిచ్చిన అమెజాన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన యాప్స్, వెబ్‌సైట్లు

Amazon Web Services Outage: అమెజాన్ వెబ్ సర్వీసెస్ సాంకేతిక లోపంతో ప్రపంచవ్యాప్తంగా పలు యాప్స్, వెబ్‌సైట్లు నిలిచిపోయాయి. వీటిలో స్నాప్ చాట్, ఫోర్ట్‌నైట్, ప్రైమ్ వీడియో వంటి టాప్ సైట్లు కూడా ఉన్నాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 20 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలకు అంతరాయం
Image Credit : Getty

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలకు అంతరాయం

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ సమస్య కారణంగా పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ప్రభావితం అయ్యాయి. టాప్ యాప్స్, వెబ్‌సైట్ల సేవలు సైతం నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ (Downdetector) వెబ్‌సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా వినియోగదారులు సేవల అవుటేజ్‌ను నివేదించారు. ఏడబ్ల్యూఎస్ అధికారిక పేజీలో “US-EAST-1 ప్రాంతంలో అనేక సేవలకు అంతరాయం కలిగింది. లేటెన్సీ కనిపిస్తోంది” అని పేర్కొంది. ఈ అవుటేజ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30లకు ప్రారంభమైందని సమాచారం.

26
అనేక ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభావం
Image Credit : Gemini

అనేక ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభావం

అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవుటేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక యాప్‌లు, వెబ్‌సైట్‌లు నిలిచిపోయాయి. వీటిలో స్నాప్ చాట్, ఫోర్ట్‌నైట్, అలెక్సా, ప్రైమ్ వీడియో, డ్యూలింగో, రింగ్ వంటివి కూడా ఉన్నాయి. అమెజాన్ క్లౌడ్ వ్యవస్థపై ఆధారపడే ఈ యాప్‌లకు కనెక్టివిటీ సమస్యలు ఎదురయ్యాయి.

డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం, Perplexity AI, Amazon Alexa, Prime Video, Epic Games Store, Venmo, Chime, Reddit, Signal, Coinbase, Canva, McDonald’s App, Disney+, Playstation Network వంటి అనేక సేవలు ప్రభావితమయ్యాయి.

Related Articles

Related image1
బంపర్ ఆఫర్.. ఈ కార్ల పై ₹2.25 లక్షల వరకు డిస్కౌంట్ !
Related image2
రూ. 21కే ఇయర్‌బడ్స్.. దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్ !
36
అమెజాన్ అవుటేజ్ పై ఏం చెప్పింది?
Image Credit : our own

అమెజాన్ అవుటేజ్ పై ఏం చెప్పింది?

అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన అధికారిక పేజీలో “US-EAST-1 ప్రాంతంలో ఉన్న అనేక సేవలకు అంతరాయం కలిగింది” అని పేర్కొంది. ఈ లోపం DynamoDB API ఎండ్‌పాయింట్ డీఎన్ఎస్ రిజల్యూషన్ సమస్య వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ బృందం దీనిని పరిష్కరించే దిశగా పనిచేస్తోందని తెలిపింది.

అలాగే, “కొన్ని సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, ఇంకా పలు ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు మళ్లీ ఒకసారి రీట్రై చేయండి” అని సూచించింది.

46
అమెజాన్ సమస్యతో ప్రభావితమైన సేవలు ఇవే
Image Credit : Getty, Kantara - A Legend/ X

అమెజాన్ సమస్యతో ప్రభావితమైన సేవలు ఇవే

అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధికారిక పేజీలో మొత్తం 37 సేవలు ఈ లోపం వల్ల ప్రభావితమయ్యాయని తెలిపింది. వీటిలో ప్రధానంగా ఉన్నవి:

• Amazon CloudFront

• Amazon Elastic Compute Cloud (EC2)

• AWS Lambda

• Amazon SageMaker

• Amazon Kinesis Data Streams

• Amazon VPC Lattice

• AWS Identity and Access Management (IAM)

• Amazon GameLift

• AWS Support Center

• AWS Systems Manager

వీటితో పాటు AWS Batch, Database Migration Service, Global Accelerator, Elemental, Polly, Q Business వంటి సేవలు కూడా అవుటేజ్‌కు గురయ్యాయి.

56
పర్‌ప్లెక్సిటీ, కాయన్ బెస్, రాబిన్ హుడ్ పై ప్రభావం
Image Credit : our own

పర్‌ప్లెక్సిటీ, కాయన్ బెస్, రాబిన్ హుడ్ పై ప్రభావం

ఏఐ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ తన X ఖాతాలో “పర్‌ప్లెక్సిటీ ప్రస్తుతం డౌన్‌లో ఉంది, కారణం ఏడబ్ల్యూఎస్ సమస్య” అని తెలిపారు. అలాగే, కాయిన్ బేస్ (Coinbase) రాబిన్ హుడ్ (Robinhood) వంటి క్రిప్టోకరెన్సీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఏడబ్ల్యూఎస్ లోపం కారణంగా నిలిచిపోయాయి.

ఉబర్ (Uber) ప్రత్యర్థి Lyft యాప్ కూడా అమెరికాలో వేలాదిమంది వినియోగదారులకు పనిచేయడం లేదు. అవుటేజ్ తమ సేవను ప్రభావితం చేసిందని మెసేజింగ్ యాప్ సిగ్నల్ (Signal) కూడా తెలిపింది.

66
ఏడబ్ల్యూఎస్ అవుటేజ్ పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
Image Credit : Instagram

ఏడబ్ల్యూఎస్ అవుటేజ్ పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి

ఏడబ్ల్యూఎస్ అవుటేజ్ పునరుద్ధరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే పలు సమస్యలను తొలగించామనీ, ఇంకా పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లను పరిష్కరించేందుకు బృందం పనిచేస్తోందని తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలను త్వరలో అందిస్తామని వెల్లడించింది.

ఏడబ్ల్యూఎస్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులు ఉపయోగించే యాప్‌లు, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఫైనాన్షియల్ సిస్టమ్‌లకు ప్రాణాధారంగా ఉంది. ఈ అవుటేజ్ వల్ల ఇంటర్నెట్‌లో పెద్ద భాగం తాత్కాలికంగా నిలిచిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
స్టాక్ మార్కెట్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved