అమెజాన్ vs ఫ్లిప్ కార్ట్ సేల్: బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఎందులో ఉన్నాయంటే..?
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొద్దిరోజుల క్రితం ముగిసిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 5 నుండి అంటే నేటి నుండి ప్రారంభమైంది. మరొ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆగష్టు 5 నుండి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించింది.
amazonఈ సేల్ ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది, అంటే వచ్చే ఐదు రోజుల పాటు. అయితే ఈ రెండు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలు రెండు అతిపెద్ద సేల్ నిర్వహిస్తూన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అమెజాన్‌లో మెరుగైన ఆఫర్లు ఉంటాయా లేక ఫ్లిప్‌కార్ట్‌లోన ?
అమెజాన్ గ్రేడ్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు
ఈ ఐదు రోజుల అమెజాన్ సేల్‌లో మొబైల్‌లు, యాక్సెసరీలపై 40 శాతం తగ్గింపును ఎలక్ట్రానిక్ వస్తువులపై 60 శాతం తగ్గింపు ఇస్తుంది. ఈ సేల్‌లో మీరు టీవీలపై 55 శాతం తగ్గింపు పొందవచ్చు. మరోవైపు ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లు క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లను కూడా పొందుతారు. ఇంకా మీరు కెమెరాలపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ట్రై పాడ్స్ పై 60 శాతం వరకు తగ్గింపును ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే మీకు రూ.30 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ప్రింటర్ లేదా ఇతర యాక్సెసరీలను కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు, వై-ఫై రౌటర్లు, మెమరీ కార్డులు, స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు మొదలైనవి 60% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులు మూడు నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందుతారు. తాజాగా లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్ నార్డ్ సిఈ 5జి, స్యామ్సంగ్ ఎం21, ఇకూ జెడ్3 5జి కూడా ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మీరు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా టీవీలు, ఉపకరణాలపై 75 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ రోగ్ ఫోన్ 3ని రూ .39,999 కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ప్రారంభ ధర ప్రస్తుతం రూ .46,999. అంటే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీరు ఈ ఫోన్‌పై రూ .7,000 తగ్గింపు పొందవచ్చు. మరోవైపు మోటరోలా రేజర్ స్మార్ట్ ఫోన్ ధర రూ .74,999కి బదులుగా కేవలం రూ .54,999 కి కొనుగోలు చేయవచ్చు.
మోటో జి40 ఫ్యూజన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రూ .13,499కి లభిస్తుంది, అయితే దీని మార్కెట్ ధర ప్రస్తుతం రూ .14,499. మరోవైపు మోటో జి60పై రూ .1,000 తగ్గింపుతో రూ .16,999 కి అందిస్తుంది. రూ .500 తగ్గింపుతో రూ .9,499కే ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ కొనుగోలు చేయవచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ఫ్లిప్ కార్ట్ సేల్ ధర రూ .5,990. దీని ఎంఆర్‌పి ధర రూ .15,990. ఐఫోన్ 12 మినీ 64జిబి వేరియంట్ ని రూ. 59,999 కి కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది, దీని ఎంఆర్‌పి ధర రూ. 69,900.