3I/ATLAS తోకచుక్కలో నీటి ఆనవాళ్లు..? గ్రహాంతరవాసులు ఉన్నట్లేనా..?
3I ATLAS Comet : ఈ విశ్వంలో మనుషులే కాదు ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) కూడా ఉన్నారా..? వీరు మనకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారా..? తాజా పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి..

3I/ATLAS పై పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి
3I/ATLAS : ఇటీవల అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ( National Aeronautics and Space Administration, NASA) అరుదైన ఖగోళ వస్తువును కనుగొంది... 3I/ATLAS అనే ఇంటర్స్టెల్లార్ తోకచుక్క ఒకటి మన సౌరవ్యవస్థలోకి ప్రవేశించిందని గుర్తించింది. ఈ తోకచుక్క భూమివైపు దూసుకువస్తోంది.. ఇది నవంబర్ లేదా డిసెంబర్ లో భూమికి అతి సమీపంలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్క చాలా ఆసక్తికరంగా ఉందని... ఇందులో నీటి ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఖగోళశాస్త్రంలో కీలక మలుపుగా చెప్పవచ్చు.
ఏమిటీ 3I/ATLAS తోకచుక్క?
3I/ATLAS అనేది యాక్టివ్ తోకచుక్క... ఇది మంచుతో నిండివుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మంచు, నీటి ఆవిరి తో పాటు కార్బన్ మోనాక్సైడ్, కార్బోనిల్ సల్పైడ్ వంటి వాయువులను కలిగివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూమికంటే ఎక్కువ వయసు గలదని గుర్తించారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే భూమిపైనే కాదు ఈ అనంత విశ్వంలో ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉన్నారనే వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ దిశగా శాస్త్రవేత్తలు మరింత లోతుగా 3I/ATLAS పై పరిశోధనలు చేస్తున్నారు.
భూమికి చేరువగా 3I/ATLAS తోకచుక్క
ఈ ఏడాది జూలైలో హవాయిలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) టెలిస్కోప్ ఈ తోకచుక్కను కనుగొంది. ఇది మన సౌరవ్యవస్థలోకి ప్రవేశిస్తున్న మూడో గ్రహాంతర తోకచుక్క. గతంలో 2017 లో Oumuamua, 2019 లో Borisov ను గుర్తించారు... ఇప్పుడు 3I/ATLAS భూమికి అతి చేరువగా వస్తున్న తోకచుక్క. ఇది 7 బిలియన్స్ ఇయర్స్ క్రితం ఏర్పడింది... అంటే భూమికంటే ముందే ఏర్పడిందని శాస్త్రవేత్తలో పరిశీలనలో తేలింది.
3I/ATLAS పై పరిశోధన ఎందుకంత ముఖ్యమైంది?
ఈ నెల నవంబర్ లేదా వచ్చేనెల డిసెంబర్ లో మరోసారి ఈ 3I/ATLAS తోకచుక్క భూమికి చేరువగా వస్తుందని... దీంతో మరింత లోతుగా దీనిని పరిశీలించే అవకాశం దొరుకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదునాతన టెలిస్కోపులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విశ్వంలో జీవ ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. ఈ 3I/ATLAS సాయంతో ఖగోళ రహస్యాలను బయటపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
గ్రహాంతర వాసులు ఉన్నారా?
చాలాకాలంగా గ్రహాంతర వాసులు (ఏలియన్స్) పై ఊహాగానాలు ఉన్నాయి... మని భూమి బయట కూడా జీవం ఉన్నట్లుగా అనేక కథనాలున్నాయి. సినిమాలు, టీవి షోలు, పుస్తకాల ద్వారా ఏలియన్స్ గురించి ప్రజలకు తెలిసింది... ఇందుకు సంబంధించిన స్టోరీలు, షోలు బాగా పాపులర్ అయ్యాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన శాస్త్రీయ విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. అప్పుడప్పుడు "ఫ్లయింగ్ సాసర్స్" (Flying saucers) కనిపించాయనే కథనాలు ఏలియన్స్ ఉనికికి బలం చేకూరుస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు శాస్త్రీయంగా మాత్రం ఏలియన్స్ ఆనవాళ్లు గుర్తించబడలేదు... కొన్నిచోట్ల నీటి ఆనవాళ్లను మాత్రం గుర్తించారు. తాజాగా సౌరవ్యవస్థలోకి ప్రవేశించిన 3I/ATLAS తోకచుక్కలో కూడా నీటి జాడ కనుగొన్నారు. ఇది విశ్వంలో మనుషులే కాదు ఇతర జీవులు కూడా ఉన్నారనే బలమైన వాదనకు బలం చేకూరుస్తోంది. ఇలాంటి పరిశోధనలు భవిష్యత్ లో ఏలియన్స్ జాడ గుర్తిస్తాయేమో చూడాలి.