MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Tech News
  • ఏఐ గేమ్ చేంజర్ గా DeepSeek ... టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్ లకే ఈ చైనా స్టార్టప్ ఛాలెంజ్

ఏఐ గేమ్ చేంజర్ గా DeepSeek ... టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్ లకే ఈ చైనా స్టార్టప్ ఛాలెంజ్

డీప్ సీక్ ... ఈ చైనీస్ స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. టెక్ దిగ్గజాలను వెనక్కినెట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకుని వెళుతోంది. అసలు ఏమిటీ డీప్ సీక్? దీన్ని స్థాపించింది ఎవరు? తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jan 28 2025, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Deepseek

Deepseek

Deepseek AI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)... మరో సాంకేతిక విప్లవానికి తెర తీసింది. ఈ ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జిపిటి ఎంతలా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన వంటివి కూడా ఈ  ఆర్టిఫిషియల్ లోకి ప్రవేశించాయి. ఇలా అమెరికన్ కంపనీలు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 

ఇలా ఏఐ విషయంలో ఇక తమకు తిరుగులేదని అగ్రరాజ్యం భావిస్తున్న సమయంలో చైనా ఎంట్రీ ఇచ్చింది. అత్యంత చౌక ధరలకే అత్యాధునిక టెక్నాలజీని అందించే చైనా కంపనీలు ఇప్పుడు ఏఐపై దృష్టి పెట్టాయి. ఇలా ఏఐ విషయంలో అమెరికా సంస్థలకు షాక్ ఇస్తూ చైనీస్ కంపనీ 'డీప్ సీక్' ఎంట్రీ ఇచ్చింది. ఇది మంచి ప్రజాధరణ పొందుతుండటంతో దిగ్గజ కంపనీలు కుదేలవుతున్నాయి. 

కేవలం ఏడాది ఏడాదిన్నర వయసు కూడా లేని డీప్ సీక్ స్టార్టప్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దూసుకుపోతోంది. దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో వున్న దిగ్గజ కంపనీలను సైతం వెనక్కి నెడుతోంది. ఈ చైనీస్ సంస్థ దాటికి అమెరికన్ టెక్ సంస్థల పరపతి పడిపోతోంది... వీటి స్టాక్స్ భారీగా పతనం అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
DeepSeek

DeepSeek

డీప్ సీక్ దెబ్బకు దిగ్గజ సంస్థలు విలవిల :

చైనీస్ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ 'డీప్ సీక్'  కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ  పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకు ఏఐ టెక్నాలజీలో ఆధిపత్యం ప్రదర్శించిన సంస్థలు విలవిల్లాడిపోతున్నాయి... భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

యూఎస్ టెక్ దిగ్గజం ఎన్విడియో (Nvidia) భారీ నష్టాలను చవిచూసింది... దాని మొత్తం విలువలో ఆరవ శాతం నష్టపోయింది. ఈ సంస్థ షేర్లు 17 శాతం పతనం అయ్యాయి... అంటే ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే దాదాపు 600 బిలియన్ డాలర్లను కోల్పోయింది ఈ టెక్ దిగ్గజం. 

ఇక డీప్ సీక్ ఏఐ దెబ్బకు మైక్రోసాఫ్ట్ 7, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 5 శాతం, గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ 4  శాతం చొప్పున నష్టపోయాయి. ఇలా అనేక కార్పోరేట్ దిగ్గజాలు ఈ చైనా సంస్థ దెబ్బకు పతనం అవుతున్నాయి.
 

33
DeepSeek

DeepSeek

డీప్ సీక్ ఓ స్టార్టప్ ... ఇంత తక్కువ సమయంలోనే ఎలా ఎదిగింది : 

డీప్ సీక్ అనేది ఏఐ రీసెర్చ్ కోసం ఏర్పాటుచేసిన స్టార్టప్. దీన్ని చైనాలోని హాంగ్జౌకు చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ 2023 లో దీన్ని స్థాపించాడు. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో ఇతడు ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. టెక్నాలజీపై మంచి పట్టున్న ఇతడు మొదట ఫైనాన్సియల్ డాటాను విశ్లేషించేందుకు ఏఐను ఉపయోగించేలా 'హెడ్జ్ ఫండ్' స్థాపించారు. 

2023 లో లియాంగ్ సొంతంగా 'డీప్ సీక్' ను ప్రారంభించారు. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లతో ఓ టీమ్ ను ఏర్పాటుచేసి ఏఐ టెక్నాలజీని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. పూర్తి ఉచితంగానే అడ్వాన్సుడ్ మోడల్ ఏఐని అందిస్తోంది ఈ సంస్థ. దీంతో ప్రపంచదేశాలు డీప్ సీక్ కు ప్రజాదరణ పెరిగింది...ఇప్పటికు కోట్లాదిమంది దీన్ని ఉపయోగిస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తలలుపండిన పెద్దపెద్ద టెక్ కంపనీలను వెనక్కి నెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకోసం డీప్ సీక్ భారీగా ఖర్చుచేస్తోంది అనుకుంటే పొరపాటే.టెక్ దిగ్గజాల కంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఇది అద్బుతాలు చేస్తోంది. కేవలం 6 మిలియన్ డాలర్లతో ఈ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ డీప్ సీక్  రూపొందించింది. ఇలా తక్కువ ఖర్చుతోనే ఇతర ఏఐ మోడళ్ల కంటే మెరుగైన పనీతీరు కరబర్చేలా రూపొందించారు.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
కృత్రిమ మేధస్సు

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved