- Home
- Technology
- Tech News
- Apple: యాప్ స్టోర్ నుంచి 1,35,000కి పైగా యాప్స్ తొలగించిన యాపిల్.. కారణం ఏంటంటే
Apple: యాప్ స్టోర్ నుంచి 1,35,000కి పైగా యాప్స్ తొలగించిన యాపిల్.. కారణం ఏంటంటే
ప్లేస్టోర్ నుంచి గూగుల్ యాప్స్‌ను తొలగించడం చాలా సార్లు చూసే ఉంటాం. యూజర్లను తప్పుదోవ పట్టించే వాటిని, యూజర్ల డేటాకు ముప్పు ఉందని భావించిన యాప్స్‌ను గూగుల్ తొలగిస్తుండేది. అయితే ఈసారి యాపిల్ ఏకంగా లక్ష ముప్పై వేల యాప్స్‌ను తొలగించింది. యాప్ స్టోర్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి యాపిల్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే కావడం గమనార్హం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ స్టోర్ నుంచి ఏకంగా 1,35,000కి పైగా యాప్‌లను తొలగించింది. గడిచిన రెండు రోజుల్లో ఈయూ సభ్య దేశాల్లో ట్రేడర్ సమాచారాన్ని అందించడంలో విఫలమైన డెవలపర్స్ తయారు చేసిన యాప్స్‌ని యాపిల్ నిషేధించింది. యాప్‌స్టోర్ ప్రారంభమైన నాటి నుంచి యాపిల్ ఇంత పెద్ద మొత్తంలో యాప్స్‌ను తొలగించడం ఇదే మొదటిసారి. సదరు ట్రేడర్స్ తిరిగి తమ స్టేటస్‌ను అందించి, యాపిల్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకునేంత వరకు ఈ నిషేధం ఉంటుందని సంస్థ తెలిపింది.
Apple
అసలు కారణం ఏంటి.?
యాప్ డెవలపర్స్ తమ చిరునామా, ఫోన్ నెంబర్, ఇమెయిల్ వంటి సమాచారాన్ని వెల్లడించని కారణంగానే యాపిల్ యాప్స్‌ను తొలగించింది. యూరోపియన్ యూనియన్ కొత్త నిబంధనల ప్రకారం యాప్ డెవలపర్స్ 'ట్రేడ్ స్టేటస్'ను అందించాల్సింది. ఇలా అవసరమైన వివరాలను అందించకపోతే యాపిల్ సంస్థ ఆ యాప్‌లను నిషేధిస్తుంది.
యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అంటే ఏమిటి?
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ చట్టం ఆగస్టు 2023లో తాత్కాలికంగా అమలులోకి వచ్చింది. ఆర్టికల్స్ 30, 31 ప్రకారం యాప్ డెవలపర్లు తమ ట్రేడర్ వివరాలైన అడ్రస్, ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటి వాటిని వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ వివరాలు లేకుంటే యూరోపియన్ యూనియన్ ప్రాంతాల్లో యాప్‌లను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2024 నుంచి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 17వ తేదీలోపు ట్రేడర్ స్టేటస్ వివరాలను అందించకపోతే వారి యాప్‌లను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తామని యాపిల్ ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా వివరాలను అందించని యాప్‌లను తొలగించేసింది.
ట్రేడర్ వివరాలను ఎందుకు అందించాలి.?
యాపిల్ ప్రకారం ట్రేడర్ అడ్రస్, ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటి ఈ వివరాలను యాప్ స్టోర్ ప్రొడక్ట్ పేజీలో పబ్లిష్ చేసేందుకు డెవలపర్లు ఆపిల్‌కు అందించాలి. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ప్రకారం, ఈ సమాచారం తప్పనిసరిగా EU ప్రాంతాల్లోని యూజర్లకు కనిపించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఆపిల్ యాప్ స్టోర్‌లోని యాప్ ప్రొడక్ట్ పేజీలో ఈ వివరాలను పొందుపరుస్తుంది. ఇది యూజర్ల భద్రతకు, మోసాలను తగ్గించేందుకు ఉపయోగపడతాయని వారి అభిప్రాయం. మరి యాపిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో అయినా యాప్ డెవలపర్స్ సమాచారాన్ని అందిస్తారో చూడాలి.