MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • '5 మ్యాచ్‌లు సరిగ్గా ఆడకపోతే.. టీ20 ప్రపంచకప్‌కు పనికిరాడా..' గిల్‌కి నేనున్నానంటున్న యువీ తండ్రి..

'5 మ్యాచ్‌లు సరిగ్గా ఆడకపోతే.. టీ20 ప్రపంచకప్‌కు పనికిరాడా..' గిల్‌కి నేనున్నానంటున్న యువీ తండ్రి..

Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపికైన భారత జట్టులో స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ పేరు లేని సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ సెలెక్టర్లను తప్పుబట్టారు. కేవలం కొన్ని వైఫల్యాలు కారణంగా గిల్‌ను తొలగించడం సరికాదని.. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 09 2026, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 ప్రపంచకప్ ఎంపికైన భారత జట్టు..

టీ20 ప్రపంచకప్ ఎంపికైన భారత జట్టు..

టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. గిల్‌ను జట్టులో తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం నాలుగైదు ఇన్నింగ్స్‌లో..
Image Credit : Getty

కేవలం నాలుగైదు ఇన్నింగ్స్‌లో..

శుభ్‌మాన్ గిల్ కేవలం నాలుగైదు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన అతన్ని ఎలా తొలగిస్తారని యోగ్‌రాజ్ ప్రశ్నించారు. భారత క్రికెట్‌లో చాలామంది ఆటగాళ్లకు తాము ఉన్నామని భరోసా ఇచ్చిన సెలెక్టర్లు గిల్‌ను ఎందుకు పక్కన పెట్టారు అని ఆయన నిలదీశారు. గతంలో కపిల్ దేవ్ ఫామ్ కోల్పోయినప్పుడు బిషన్ సింగ్ బేడీ అతనికి ఎలా తోడుగా నిలిచారో యోగ్‌రాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత సెలెక్టర్లు గిల్ విషయంలో ఆ సహనం చూపించడం లేదని ఆయన విమర్శించారు.

Related Articles

Related image1
టెస్టుల్లో తోపు.. కట్ చేస్తే.. టీ20ల్లో తుస్సుమన్న గిల్.. 2025 జాతకం ఇదే.!
Related image2
కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..
35
టీ20ల్లో గిల్ ఫెయిల్..
Image Credit : Getty

టీ20ల్లో గిల్ ఫెయిల్..

శుభ్‌మాన్ గిల్ గతేడాది టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతడు ఆడిన 15 మ్యాచుల్లో 24.25 సగటుతో 291 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 137.26గా ఉంది. ఈ మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ ఒక్క కారణంతోనే గిల్‌ను టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించారు అని అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

45
గిల్ తొలగింపుపై క్లారిటీ..
Image Credit : BCCI\Twitter

గిల్ తొలగింపుపై క్లారిటీ..

గిల్ తొలగింపుపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. గిల్ ప్రతిభావంతుడైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అగార్కర్ తెలిపాడు. 

55
ఇషాన్ కిషన్ ఎంపిక అందుకే..
Image Credit : BCCI

ఇషాన్ కిషన్ ఎంపిక అందుకే..

టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం అని భావించి, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. జట్టు కూర్పులో సమతుల్యత సాధించడమే లక్ష్యమని అగార్కర్ స్పష్టం చేశాడు. యోగ్‌రాజ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
టెస్టుల్లో తోపు.. కట్ చేస్తే.. టీ20ల్లో తుస్సుమన్న గిల్.. 2025 జాతకం ఇదే.!
Recommended image2
కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved