WPL 2026 మెగా వేలం షెడ్యూల్ ఇదే! ఎప్పుడు? ఎక్కడ? పూర్తి వివరాలు
WPL 2026 Mega Auction: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగో సీజన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో WPL మెగా వేలం షెడ్యూల్ ఖరారైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

WPL వేలానికి కౌంట్‌డౌన్
నాలుగో సీజన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తుందోనన్న ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది.
నవంబర్ 27న వేలం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం షెడ్యూల్ ఇప్పుడు ప్రకటించారు. మహిళల ఐపీఎల్‌గా పిలిచే WPL మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. WPL వేలంలో కొత్త, ఇప్పటికే ఉన్న ఆటగాళ్ల కోసం తీవ్రమైన బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది, టోర్నమెంట్‌కు ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను పునర్నిర్మించడానికి కీలకమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది.
ప్రతి జట్టులో 18 మంది ప్లేయర్లకు అవకాశం
WPL వెబ్‌సైట్ ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 18 మంది ప్లేయర్లతో జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందే తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి.
గరిష్టంగా 73 మంది ప్లేయర్లను కొనే అవకాశం
5 WPL ఫ్రాంచైజీలు 23 మంది విదేశీ ప్లేయర్లతో సహా గరిష్టంగా 73 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు. యూపీ టీమ్ అత్యధిక పర్స్‌తో మెగా వేలంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది.
ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బుంది?
ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 5.7 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 5.75 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 6.15 కోట్లు, గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 9 కోట్లు, యూపీ వారియర్జ్ వద్ద రూ. 14.5 కోట్లు ఉన్నాయి.
స్టార్ స్పోర్ట్స్-హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్, జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.