- Home
- Sports
- ఒలింపిక్స్‌లో కలిసిన మిర్కాని ప్రేమించి, పెళ్లాడిన రోజర్ ఫెదరర్... నలుగురు పిల్లలకు తండ్రిగా...
ఒలింపిక్స్‌లో కలిసిన మిర్కాని ప్రేమించి, పెళ్లాడిన రోజర్ ఫెదరర్... నలుగురు పిల్లలకు తండ్రిగా...
టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 310 వారాల పాటు వరల్డ్ నెం.1 గా నిలిచిన స్విస్ దిగ్గజం, 237 వారాల పాటు వరుసగా అగ్రస్థానాన నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. తన కెరీర్‌లో 103 ఏటీపీ సింగిల్ టైటిల్స్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (అందులో 8 వింబుల్డన్ టైటిల్స్) సాధించిన రోజర్ ఫెదరర్, ట్రూ జెంటిల్మెన్‌గా కీర్తి ప్రతిష్టలు సాధించాడు... రోజర్ ఫెదరర్ లవ్ లైఫ్ కూడా అంతే ఆసక్తికరంగా సాగింది...

Roger Federer and wife Mirka
రోజర్ ఫెదరర్ భార్య మిర్కా మిరోస్లోవా కూడా టెన్నిస్ ప్లేయరే. స్విట్జర్లాండ్‌కి చెందిన మిర్కా, తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో టైటిల్స్ ఏమీ గెలవలేకపోయింది కానీ ఫెదరర్ మనసు మాత్రం గెలిచుకుంది. 2000 సమ్మర్ ఒలింపిక్స్‌లో రోజర్ ఫెదరర్, మిర్కా తొలిసారి కలిశారు...
2002లో అరికాలికి తీవ్ర గాయం కారణంగా తన ప్రొఫెషనల్ టెన్నిస్‌ని ఒక్క టైటిల్ లేకుండానే ముగించింది మిర్కా. రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి టాప్ 100 ర్యాంకర్లలో ఒకరిగా ఉంది...
ఈ పరిచయం ఆ తర్వాత స్నేహంగా మారి, ప్రేమగా మలుపు తిరిగి... కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత చివరికి 2009లో పెళ్లి చేసుకున్నారు రోజర్ ఫెదరర్, మిర్కా... ఈ ఇద్దరికీ నలుగురు పిల్లలు. ఇక్కడ విశేషం ఏంటంటే... రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిచ్చింది మిర్కా ఫెదరర్...
Image credit: Getty
పెళ్లైన కొన్ని నెలలకే 2009 జూలైలో ఇద్దరు కవల అమ్మాయిలకు జన్మనిచ్చింది మిర్కా. వీరికి చార్లీన్ రివా, మిలా రోజ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరికి లియో, లెన్నీ అని నామకరణం చేశారు ఫెదరర్ దంపతులు...
‘నాకు ఒక్క టైటిల్ కూడా లేనప్పుడు తను నాతో ఉంది. ఇప్పుడు నా పేరు మీద 89 టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తను నాతో ఉంది. నా ప్రతీ విజయంలో తనకీ భాగం ఉంది...’ అంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత కామెంట్ చేశాడు రోజర్ ఫెదరర్. రిటైర్మెంట్ తర్వాత తన భార్యకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు ఫెదరర్...