షఫాలీ వర్మ: 15 ఏళ్లకే అరంగేట్రం.. కట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్
Who is Shafali Verma : భారత మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. టీమిండియా యంగ్ క్రికెటర్ షఫాలీ వర్మ 87 పరుగుల ఇన్నింగ్స్ తో వరల్డ్ కప్ ఫైనల్‌లో చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికా పై ఎప్పటికీ గుర్తిండిపోయే నాక్ ఆడింది.

చిన్నతనంలోనే బ్యాటింగ్ ప్రతిభ చూపిన షఫాలీ వర్మ
భారత క్రికెట్‌లో టాప్ ఓపెనర్‌గా పేరు పొందిన షఫాలీ వర్మ 2004 జనవరి 28న హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. కానీ ప్రాథమిక దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ క్రమశిక్షణతో కృషి చేస్తూ తన కలను నెరవేర్చింది. ప్రస్తుతం 21 ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు పొందిన యంగ్ ప్లేయర్ గా నిలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ ను ఆడింది.
Second-fastest 5⃣0⃣ in a women's ODI WC final ✅
Youngest to score a 5⃣0⃣ in an ODI World Cup final ✅
Shafali Verma's fiery 87 set the tone for #TeamIndia 👏
Updates ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final | @TheShafaliVermapic.twitter.com/gLxuVCTZyA— BCCI Women (@BCCIWomen) November 2, 2025
రికార్డులతో నిండిన షఫాలీ వర్మ క్రికెట్ ప్రయాణం
షఫాలీ వర్మ 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, 2019లో థాయ్‌లాండ్‌పై తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో ఆమె తన ప్రదర్శనతోనే భారత అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
2020లో ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్ చేరినప్పుడు, షఫాలీ వర్మ ఆ టోర్నీలో కీలక పాత్ర పోషించింది. 2022 ఆసియా కప్‌లో భారత విజయానికి ముఖ్య కారణం షఫాలీ వర్మ. 2023లో తొలి మహిళల అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్ కూడా షఫాలీనే.
టెస్ట్, లీగ్‌లలో షఫాలీ వర్మ సూపర్ నాక్ లు
2021లో ఇంగ్లాండ్‌పై తన టెస్ట్ అరంగేట్రంలో షఫాలీ వర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలుచుకుంది.
లీగ్ మ్యాచ్ ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె డిల్లీ క్యాపిటల్స్ తరఫున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఆడుతోంది. అలాగే, విమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో సిడ్నీ సిక్సర్స్ తరఫున, అలాగే ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు తరఫున ఆడుతున్నారు.
షఫాలీ వర్మ క్రికెట్ రికార్డులు, గణాంకాలు
• టీ20 ఇంటర్నేషనల్‌లో 1000 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కురాలు షఫాలీ వర్మ.
• భారత మహిళా బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ (131.04) కలిగిన ఆటగాళ్లలో ఒకరు.
• టెస్ట్ క్రికెట్‌లో 205 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
• 2019లో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డు.
షఫాలీ వర్మ నెట్ వర్త్ ఎంత? ఆదాయ వివరాలు
2025 నాటికి షఫాలీ వర్మ నెట్ వర్త్ సుమారు ₹12 నుండి ₹15 కోట్ల మధ్యగా ఉంటుందని అంచనా. (సుమారు 1.5 నుండి 2 మిలియన్ అమెరికన్ డాలర్లు). ఆమె ఆదాయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), WBBL మ్యాచ్ ఫీజులు, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వస్తోంది.
వరల్డ్ కప్ ఫైనల్లో షఫాలీ వర్మ కొత్త చరిత్ర
నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో షఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 78 బంతుల్లో 87 పరుగులు చేసి, భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్లలో తొలి ప్లేయర్ గా రికార్డు సాధించింది.
ఇంతకు ముందు పూనమ్ రౌత్ 2017 వరల్డ్ కప్ ఫైనల్‌లో 86 పరుగులు చేయగా, షఫాలీ ఆ రికార్డును అధిగమించింది. ఆమె తరువాత 100 పరుగులు దాటే అవకాశాన్ని కోల్పోయినా, తన దూకుడైన బ్యాటింగ్‌తో భారత అభిమానులను ఆకట్టుకుంది.
అంతేకాకుండా, షపాలీ వర్మ వరల్డ్ కప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన మూడవ భారత మహిళా ఆటగాళ్లలో ఒకరు.. అంతకుముందు, హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్ ఈ రికార్డు సాధించారు.
భారత క్రికెట్ చరిత్రలో షఫాలీ వర్మ కొత్త మైలురాయి
వరల్డ్ కప్ ఫైనల్‌లలో భారత ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో షఫాలీ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. మహిళ విషయంలో టాప్ లో కొనసాగుతున్నారు.
1. గౌతమ్ గంభీర్ – 97 (2011)
2. ఎంఎస్ ధోని – 91* (2011)
3. షఫాలీ వర్మ – 87 (2025)
4. పూనమ్ రౌత్ – 86 (2017)
షఫాలీ వర్మ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు.. భారత మహిళా క్రికెట్‌కు ప్రేరణ కూడా. చిన్న వయసులోనే ఆమె సాధించిన విజయాలు భవిష్యత్ తరాల మహిళా క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలుస్తాయి.