సచిన్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. షఫాలీ వర్మ కొత్త చరిత్ర
Shafali Verma : నేవీ ముంబైలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో షఫాలీ వర్మ 87 పరుగులతో చరిత్ర సృష్టించింది. టీమిండియా లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టింది.

ఫైనల్ లో షఫాలీ వర్మ చరిత్రాత్మక ఇన్నింగ్స్
భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఆదివారం (నవంబర్ 2) నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 21 సంవత్సరాల వయసులోనే రికార్డుల మోత మోగించింది. 87 పరుగులు నాక్ తో షఫాలీ వర్మ భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. 78 బంతుల్లో 87 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ప్రతికా రావల్ గాయంతో జట్టులోకి రిజర్వ్‌గా తీసుకున్న షఫాలీ వర్మ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. సెమీఫైనల్లో తక్కువ పరుగులు చేసినప్పటికీ, ఫైనల్లో ఆమె తన బ్యాటింగ్ ప్రతిభను చూపించింది.
స్మృతి మంధానతో షఫాలీ వర్మ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం
స్మృతి మంధాన, షఫాలీ వర్మ జోడీ ఫైనల్లో 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత మహిళల జట్టుకు అత్యధిక ఓపెనింగ్ జంటగా నిలిచింది. అంతేకాదు, భారత క్రికెట్‌లో పురుషులు–మహిళలు కలిపి కూడా ఈ ఘనతను సాధించిన తొలి జంట వీరిదే.
గత రికార్డు 2017 ప్రపంచ కప్‌లో పూర్ణిమా రావ్, ఎస్ హరికృష్ణ జంట పేరిట 20 పరుగులు మాత్రమే. ఇప్పుడు మంధాన, షఫాలీ వర్మ జంట 104 పరుగులు చేసి ఆ రికార్డును బద్దలుకొట్టింది.
ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన షఫాలీ వర్మ
షఫాలీ వర్మ 87 పరుగులు భారత్ తరఫున ప్రపంచ కప్ ఫైనల్లో సాధించిన అత్యధిక స్కోరు. 2017లో పూనమ్ రౌత్ ఇంగ్లాండ్‌పై 86 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు షఫాలీ వర్మ ఆ రికార్డును అధిగమించింది.
ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ (97, 2011), ఎంఎస్ ధోనీ (91*, 2011) తర్వాత మూడో స్థానంలో షఫాలీ వర్మ నిలిచింది. ఆమెతో పాటు పూనమ్ రౌత్ (86, 2017), వీరేంద్ర సెహ్వాగ్ (82, 2003) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
షఫాలీ వర్మ పై ప్రశంసల వర్షం
21 సంవత్సరాలు 278 రోజుల వయసులో ప్రపంచ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా షఫాలీ వర్మ రికార్డు సాధించింది. అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. ఒకరు "ఈ ఇన్నింగ్స్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది" అని రాస్తే, మరొకరు "పెద్ద స్టేజీలపై పెద్ద ప్లేయర్లు ఎలా ఆడాలో షఫాలీ వర్మ చూపించింది" అంటూ కామెంట్స్ చేశారు.
ఆమె అటాకింగ్ బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం లభించింది. మొదటి బంతినుండే ఆమె ధైర్యంగా ఆడుతూ, సౌతాఫ్రికా బౌలర్లపై దాడి ప్రారంభించింది. కేవలం 49 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.
రికార్డుల మోత మోగించిన షఫాలీ వర్మ
షఫాలీ వర్మ ఫైనల్లో సెంచరీకి దగ్గరగా చేరినా, 28వ ఓవర్‌లో అవుట్ అయ్యింది. అయినా, ఆమె రికార్డుల మోత మోగించారు. ఆమె 87 పరుగులు భారత మహిళా ఆటగాళ్లలో ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అలాగే పురుషుల క్రికెట్‌లో సచిన్, సెహ్వాగ్ ల ఫైనల్ రికార్డులను కూడా ఆమె అధిగమించింది.
భారత జట్టుకు మొదటి వికెట్‌కి 104 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించి, తరువాత స్మృతి మంధాన ఔటయ్యాక జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లింది.