MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • ఎవరీ పూజా యాదవ్..? మాజీ క్రికెటర్ కైఫ్ వైఫ్ ది హీరోయిన్లకు తీసిపోని అందం

ఎవరీ పూజా యాదవ్..? మాజీ క్రికెటర్ కైఫ్ వైఫ్ ది హీరోయిన్లకు తీసిపోని అందం

టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ది మతాంతర వివాహం. ఆయన భార్య పూజా యాదవ్ ఓ హిందూ కుటుంబంలో జన్మించారు. అయితే వీరి ప్రేమాయణం సినిమా స్టోరీని తలపిస్తుంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 09 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాజీ క్రికెటర్ కైఫ్ లవ్ స్టోరీ...
Image Credit : x/MohammadKaif

మాజీ క్రికెటర్ కైఫ్ లవ్ స్టోరీ...

Pooja Yadav : ఇండియన్ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే టక్కున మహమ్మద్ కైఫ్ పేరు వినిపిస్తుంది.  ఆ రోజుల్లో ఇతడిని అభిమానులు ముద్దుగా ఇండియన్ జాంటిరోడ్స్ అని పిలుచుకునేవారు. అందరు బ్యాటింగ్ లేదా బౌలింగ్ తో గుర్తింపు పొందితే కైఫ్ కళ్లుచెదిరే ఫీల్డింగ్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు... ఇలాగే పూజా యాదవ్ మనసులో కూడా స్థానం సంపాదించాడు. కైఫ్ సతీమణి పూజా యాదవ్ గురించి... వీరి ప్రేమకథ గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కైఫ్, ఫూజా యాదవ్ ఎలా కలుసుకున్నారు..?
Image Credit : x/MohammadKaif

కైఫ్, ఫూజా యాదవ్ ఎలా కలుసుకున్నారు..?

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ (గతంలో అలహాబాద్) పట్టణంలోని ఓ మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు మహమ్మద్ కైఫ్. ఎంతో కష్టపడి క్రికెటర్ గా ఎదిగాడు... సుధీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు 2018 లో అన్ని ఫార్మాట్స్ నుండి రిటైర్ అయ్యాడు. ఇతడి క్రికెట్ జర్నీ అంత అద్భుతంగా ఏం లేదు... కానీ లవ్ జర్నీ మాత్రం అద్భుతం. అతడు కులమతాలకు అతీతంగా ఓ హిందూ మహిళను ప్రేమించి పెళ్లాడాడు.

టీమిండియా క్రికెటర్ గా కొనసాగుతున్న సమయంలో కైఫ్, పూజా యాదవ్ మధ్య పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన పూజా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా 2007 లో కైఫ్ ను కలిశారు. తొలిచూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది... అదికాస్త ప్రేమగా మారింది… పెళ్లితో ఇద్దరి జీవితాలు ఒక్కటయ్యాయి.

35
నాలుగేళ్లు డేటింగ్...
Image Credit : Instagram

నాలుగేళ్లు డేటింగ్...

అయితే కైఫ్, పూజా యాదవ్ ప్రేమాయణం అంత సాఫీగా ఏం సాగలేదు... ఇద్దరి కులాలు వేరు కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేకపోయారు... అందుకే పెళ్లికి ముందే కలిసి జీవించారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని సాగిస్తున్నారు.

2007 లోనే పరిచయం కాస్త ప్రేమగా... అదికాస్త సహజీవనంగా మారింది. కైఫ్, పూజా 4 సంవత్సరాలు డేటింగ్ లో ఉన్నారు... మార్చి 26, 2011 లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మతాలు, కట్టుబాట్లు వేరువేరు అయినప్పటికీ ప్రేమ అనేది వీరిని కలిపింది... జీవితాంతం కలిసి ఉండేలా చేసింది.

ప్రస్తుతం కైఫ్, పూజా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత ఏడాదే అంటే ఫిబ్రవరి 28, 2012న పెద్ద కుమారుడు కబీర్ కు జన్మనిచ్చింది పూజా. వారి కుమార్తె ఎవా 2017లో జన్మించింది. ఇలా చిన్న కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తున్నాడు కైఫ్.

45
క్రికెటర్ నుండి వ్యాఖ్యాతగా...
Image Credit : Getty

క్రికెటర్ నుండి వ్యాఖ్యాతగా...

2000 సంవత్సరంలో టీమిండియా జెర్సీ ధరించి మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహమ్మద్ కైఫ్... తర్వాత 18 సంవత్సరాలు అతడి ప్రయాణం క్రికెటర్ గా కొనసాగింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా బరిలోకి దిగినా పెద్దగా రాణించలేకపోయాడు... కానీ ఫీల్డింగ్ లో అద్భుతాలు చేశారు. కొన్ని మ్యాచులను కేవలం కైఫ్ ఫీల్డింగ్ గెలిపించిందంటే అతిశయోక్తి కాదు.

2018 లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కైఫ్ వ్యాఖ్యాతగా మారాడు. ఐపిఎల్ లో డిల్లీ క్యాపిటల్స్ కి అసిస్టెంట్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

55
కైఫ్ పొలిటికల్ ఎంట్రీ...
Image Credit : Getty

కైఫ్ పొలిటికల్ ఎంట్రీ...

కైఫ్ క్రికెటర్ గా కొనసాగుతూనే రాజకీయ రంగప్రవేశం చేశారు... కానీ అందులో అతడు రాణించలూకపోయాడు. కాంగ్రెస్ పార్టీ తరపున 2014 లో లోక్ సభ బరిలో నిలిచాడు... సొంతరాష్ట్ర యూపీలోని ఫుల్ ఫూర్ నుండి పోటీచేశాడు. కానీ బిజెపి నేత కేశవ్ ప్రసాద్ మౌర్య చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమి అతడిని రాజకీయాలకు దూరం చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ప్రసిద్ధ వ్యక్తులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
Cricket : చెడు అలవాట్లతో చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న టాలెెంటెడ్ క్రికెటర్లు.. టాప్ 5 లిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved