MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర

ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర

Virat Kohli : విరాట్ కోహ్లీ రాంచీ వన్డేలో సెంచరీ బాదాడు. ఈ క్లాసిక్ నాక్ తో అత్యధిక సెంచరీల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి లెజెండరీల రికార్డులను బ్రేక్ చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 30 2025, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచీ లొ కోహ్లీ రికార్డుల మోత
Image Credit : X/BCCI

రాంచీ లొ కోహ్లీ రికార్డుల మోత

భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ తొలి మ్యాచ్ రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో కొత్త చరిత్ర రాశారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
102 బంతుల్లో సెంచరీ కొట్టిన కోహ్లీ
Image Credit : X/BCC

102 బంతుల్లో సెంచరీ కొట్టిన కోహ్లీ

ఈ మ్యాచ్ లో సూపర్ నాక్ తో కోహ్లీ వన్డేల్లో 52వ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ తన కెరీర్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో 51 సెంచరీలు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో కొట్టి కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడిగా నిలిచాడు.

Related Articles

Related image1
ఐపీఎల్ కు ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. పాకిస్తానే కారణం
Related image2
టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !
35
దేశంలో అత్యధిక 50+ స్కోర్లు.. టాప్ లో కోహ్లీ
Image Credit : X/BCC

దేశంలో అత్యధిక 50+ స్కోర్లు.. టాప్ లో కోహ్లీ

వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత గడ్డపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ ఇప్పుడు టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దేశంలో ఆయన చేసిన ఇది 59వ 50+ స్కోరు. దీంతో ఆయన సచిన్ టెండూల్కర్ (58 హాఫ్ సెంచరీలు)ను దాటేశాడు.

ఇక సౌతాఫ్రికా స్టార్ జాక్వెస్ కాలిస్ తన దేశంలో 46 సార్లు, రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలో 45 సార్లు 50+ స్కోర్లు చేశారు.

మ్యాచ్ విషయానికి వస్తే, యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు 25 పరుగులు జోడించారు. జైస్వాల్ 18 పరుగులు చేసి అవుటయ్యారు. ఆయన వెంటనే మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ, రోహిత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం అందించారు. ఇద్దరి మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. రోహిత్ 57 పరుగులు చేసి అవుటయ్యారు.

45
ఒకే ఫార్మాట్‌లో ఎక్కవ సెంచరీలు.. టాప్ లో కోహ్లీ
Image Credit : X/BCC

ఒకే ఫార్మాట్‌లో ఎక్కవ సెంచరీలు.. టాప్ లో కోహ్లీ

విరాట్ కోహ్లీ ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డుతో టాప్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేశారు. 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఆయన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ. ఆయన ఇప్పటివరకు 306 వన్డేలు ఆడారు.

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్ టెస్ట్‌ల్లో 45 సెంచరీలు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 టెస్ట్ సెంచరీలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.  సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

55
పాంటింగ్, టెండూల్కర్ రికార్డులు బద్దలు
Image Credit : X/@BCCI

పాంటింగ్, టెండూల్కర్ రికార్డులు బద్దలు

రాంచీ వన్డేలో కోహ్లీ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. మూడో స్థానంలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశాడు. రికీ పాంటింగ్ చేసిన 217 సిక్సర్ల రికార్డును ఆయన అధిగమించారు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టగానే ఈ రికార్డును అందుకున్నాడు.

ద్వైపాక్షిక సిరీస్ వన్డేల్లో 10,000 రన్స్ చేసిన ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా కోహ్లీ అవతరించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన ఖాతాలో 9,936 పరుగులు ఉన్నాయి. 64వ రన్ పూర్తి చేసిన వెంటనే ఈ రికార్డు ఆయన సొంతమైంది.

అలాగే హోం గ్రౌండ్ లో అన్ని ఫార్మాట్ల్లో కలిపి 50+ స్కోర్లు 100 మార్క్ దాటిన నాలుగో బ్యాటర్‌గా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో టెండూల్కర్ (112), పాంటింగ్ (106), కాలిస్ (104) లు కోహ్లీ కంటే ముందున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
ఐపీఎల్ కు ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. పాకిస్తానే కారణం
Recommended image2
టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved