పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనం
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో మెడల్ ను అందించడానికి టీమిండియా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సిద్ధంగా ఉన్నారు. తొలుత జపాన్ స్టార్ సుసై యుయ్‌ని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ ఒక్సానాను ఓడించి సెమీస్ చేరుకుని సంచలనం సృష్టించింది.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళా రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనం సృష్టించారు. భారత్ కు మరో మెడల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ పోటీలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
Vinesh Phogat
వినేష్ తొలుత జపాన్ స్టార్, ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ సుసాయ్ హుయ్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ కు చెందిన ఒస్కానా లివాచ్ ఓడించి పతకం దిశగా అడుగులు వేసింది.
Paris Olympics 2024 - vinesh phogat
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్ చివరి 5 సెకన్లలో సినిమా ఫైట్ స్టైల్‌లో రెండు పాయింట్లు సాధించి విజయం అందుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్‌ను ఓడించి 3 పాయింట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది వినేష్ ఫోగట్.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వినేశ్ ఫోగట్‌కు ప్రారంభంలో మ్యాచ్ ఆమె చేతుల్లోంచి జారిపోతున్నట్లు అనిపించింది. కానీ ఆమె మెరుపు ప్రదర్శన చేసి జపాన్‌కు చెందిన సుసాకిని 3-2తో ఓడించింది. ఈ ఓటమితో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ సుసాకి ఆశ్చర్యంతో షాక్ కు గురైంది.
Vinesh Phogat
సుసాకి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్‌ను ఓడించి పతకాల ఆశలను వినేష్ ఫోగట్ పెంచుకుంది. ఈ గెలుపుతో వినేష్ ఫోగట్ దాదాపు ఒక మెడల్ ను ఖాయం చేసింది.
Vinesh Phogat
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్, ఒస్కానా మధ్య గట్టి పోటీ నెలకొంది. వినేష్ మొదటి నుంచి ఓస్కానాపై ఆధిపత్యం చెలాయించేలా కనిపించాడు. అయితే ఆ తర్వాత ఒస్కానా పునరాగమనం మ్యాచ్‌లో ఉత్సాహాన్ని నింపింది. అయితే చివరికి ఉక్రెయిన్‌కు చెందిన ఒస్కానా లివాచ్ 7-5తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండు సార్లు ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఇప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నాడు.