MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : ఐపీఎల్ మొదలవ్వకముందే మైండ్ బ్లోయింగ్ న్యూస్.. వైభవ్ కు అడ్డులేదిక !

Vaibhav Suryavanshi : ఐపీఎల్ మొదలవ్వకముందే మైండ్ బ్లోయింగ్ న్యూస్.. వైభవ్ కు అడ్డులేదిక !

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒకరోజు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐసీసీ నిబంధనల నుంచి విముక్తి లభించింది. 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు అతను టీమ్ ఇండియా ఎంపికకు అర్హత సాధించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 27 2026, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీమిండియాలోకి నయా విధ్వంసకర వీరుడు.. వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ !
Image Credit : X/BCCI

టీమిండియాలోకి నయా విధ్వంసకర వీరుడు.. వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ !

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి మార్చి 27, 2026 ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది. ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ప్రారంభానికి సరిగ్గా ఒకరోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు కేవలం వేడుక మాత్రమే కాదు, అతని కెరీర్‌లో ఒక పెద్ద మలుపును తీసుకొచ్చింది. 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, వైభవ్ ఇప్పుడు భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యేందుకు అధికారికంగా అర్హత సాధించారు. ఇన్నాళ్లూ అతని ఎంపికకు అడ్డుగా ఉన్న ఐసీసీ వయోపరిమితి నిబంధన ఇప్పుడు తొలిగిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైభవ్ కు అడ్డంకిగా మారిన ఐసీసీ నిబంధన ఏమిటి?
Image Credit : X/BCCI

వైభవ్ కు అడ్డంకిగా మారిన ఐసీసీ నిబంధన ఏమిటి?

వైభవ్ సూర్యవంశీ గత ఏడాది ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, టీమిండియా సెలెక్టర్లు అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఐసీసీ (ICC) 2020 నవంబర్‌లో ప్రవేశపెట్టిన ఒక నిబంధన. అంతర్జాతీయ క్రికెట్ (పురుషులు, మహిళలు లేదా అండర్-19) ఆడే ఏ ఆటగాడైనా కనీసం 15 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది.

ఆటగాళ్ల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు వైభవ్ వయస్సు 14 ఏళ్లే కావడంతో, అతని ఆట ఎంత అద్భుతంగా ఉన్నా భారత జట్టు తలుపులు తట్టలేకపోయారు. కానీ నేడు 15వ పడిలోకి అడుగుపెట్టడంతో ఆ అడ్డంకి తొలగిపోయింది.

35
ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
Image Credit : X/BCCI

ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

బీహార్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు. కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్, తన మొదటి మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటుకున్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురిచేశారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డు సాధించాడు.

45
గణాంకాల్లో కూడా వైభవ్ సూర్యవంశీ ప్రభంజనం
Image Credit : RR Twitter

గణాంకాల్లో కూడా వైభవ్ సూర్యవంశీ ప్రభంజనం

వైభవ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత కూడా తన జోరును కొనసాగించారు. భారత అండర్-19 జట్టు తరపున ఆడుతూ పరుగుల వరద పారించారు. ఇప్పటివరకు వైభవ్ కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే..

• టీ20 క్రికెట్: 18 మ్యాచ్‌ల్లో 701 పరుగులు (3 సెంచరీలు).

• లిస్ట్ ఏ (వన్డే): 8 మ్యాచ్‌ల్లో 353 పరుగులు (1 సెంచరీ).

• ఫస్ట్ క్లాస్: 8 మ్యాచ్‌ల్లో 207 పరుగులు.

ఏ ఫార్మాట్‌లో ఆడినా భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల పని పట్టడం వైభవ్ శైలి.

55
క్రికెట్ యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

క్రికెట్ యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ

మార్చి 28 నుండి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో కూడా వైభవ్ తన బ్యాట్‌తో గర్జించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వయోపరిమితి అడ్డంకి తొలగిపోవడంతో, ఈ ఐపీఎల్‌లో అతను రాణిస్తే నేరుగా టీమ్ ఇండియా బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఉంది. సెలెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా వైభవ్ భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. భారత క్రికెట్‌లో మరో సంచలన యుగం మొదలైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ 2026 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది.. ముంబై vs చెన్నై ఫైట్ ఎప్పుడంటే?
Recommended image2
IPL 2026 : సన్‌రైజర్స్ సిక్సర్ల కింగ్.. అభిషేక్ శర్మ షేక్ చేస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved