ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక మెడల్స్ గెలిచిన టాప్-5 అథ్లెట్లు
most Olympic medals winners : 2024 ఒలింపిక్ గేమ్స్ జూలై, ఆగస్టు నెలల్లో పారిస్ వేదికగా జరగనున్నాయి. 16 రోజుల పాటు మొత్తం 329 పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. జులై 26 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అధికారిక ప్రారంభానికి రెండు రోజులు ముందు మూడు పోటీలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
most Olympic medal winners
most Olympic medals winners : యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ 2024 కు సర్వం సిద్ధం చేసింది ఫ్రాన్స్. ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కు పారిస్ వాయవ్య శివారు ప్రాంతమైన కొలోంబెస్ లోని ఈ చారిత్రాత్మక వేదిక 2024 జూలైలో వేదికకావడంతో రెండు ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచంలోని అతికొద్ది క్రీడా మైదానాలలో ఒకటిగా చరిత్ర సృష్టించనుంది. 1907 లో నిర్మించిన ఈ స్టేడియం 1924 క్రీడలకు కూడా ప్రధాన వేదికైంది. కాగా, ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్లను గమనిస్తే..
1. మైఖేల్ ఫెల్ప్స్
ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ మైఖేల్ ఫెల్ప్స్. అమెరికాకు చెందిన ఈ గ్రేట్ స్విమ్మర్ ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ లో మొత్తం 28 మెడల్స్ సాధించాడు. ఇందులో 23 బంగారు, 3 వెండి, 2 కంచు పతకాలు ఉన్నాయి. ఇప్పటివరకు 20కి పైగా మెడల్స్ గెలిచిన అథ్లెట్ మైఖేల్ ఫెల్ప్స్ ఒక్కడే కావడం విశేషం.
2. లారిసా లాటినినా
ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన రెండో అథ్లెట్ లారిసా లాటినినా. రష్యాకు చెందిన ఈ స్టార్ అథ్లెట్ జిమ్నాస్టిక్స్ లో మొత్తం 18 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్నారు. ఇందులో 9 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అలాగే, 4 కంచు పతకాలు కూడా సాధించింది.
3. మారిట్ బ్జోర్గెన్
మారిట్ బ్జోర్గెన్ నార్వే కు చెందిన గ్రేట్ అథ్లెట్. ఈ నార్వేజియన్ క్రాస్ కంట్రీ స్కీయర్ ఒలింపిక్ చరిత్రలో అత్యధిక మెడల్స్ సాధించిన రెండో మహిళా అథ్లెట్. ఇంటర్నేషనల్ స్కీయింగ్ విభాగంలో మొత్తం 15 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్నారు. ఇందులో 8 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 3 కంచు పతకాలు ఉన్నాయి.
4. నికోలాయ్ ఆండ్రియానోవ్
రష్యాకు చెందిన ఈ అథ్లెట్ జిమ్నాస్టిక్స్ లో మొత్తం 15 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇందులో 7 గోల్డ్, 5 సిల్వర్, 3 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
5. ఓలే ఎయినార్ బ్జోర్ండాలెన్
నార్వేకు చెందిన ఈ స్టార్ అథ్లెట్ ఒలింపిక్ గేమ్స్ చరిత్రలో అత్యధిక మెడల్స్ సాధించిన ఐదో క్రీడాకారుడిగా ఉన్నాడు. బయాథ్లాన్, క్రాస్ కంట్రీ స్కీయింగ్ విభాగంలో మొత్తం 13 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇందులో 8 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అలాగే, 4 వెండి, ఒక కంచు పతకం కూడా సాధించాడు.