Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్సీపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్
Shubman Gill : ఇంగ్లాండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. తాజాగా భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడంపై గిల్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టును నడిపించనున్న గిల్
Shubman Gill : భారత క్రికెట్ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. కొత్తగా నియమితులైన టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జూన్‌లో జరిగే ఐదు టెస్ట్‌ల ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇది 2025–27 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌కి ప్రారంభం కావడం విశేషం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత మొదటి టెస్టు సిరీస్
లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్. అశ్విన్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో భారత జట్టు నాయకత్వ బాధ్యతలను గిల్ స్వీకరించడమంటే కొత్తతరం జట్టును ముందుకు నడిపించే మార్పు ప్రారంభమైనట్టు అర్థం. భారత జట్టునకు చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో 24 ఏళ్ల గిల్ కెప్టెన్సీపై తన భావాలను పంచుకున్నాడు.
భారత టెస్టు జట్టు కెప్టెన్సీలో గిల్ కామెంట్స్
"చిన్నతనంలో ఎవరైనా క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు, వారి లక్ష్యం భారత్ తరఫున ఆడటమే. టెస్ట్ క్రికెట్ కోసం ఆడాలనుకోవడం సహజం. ఇప్పుడు ఆ అవకాశం లభించడం గొప్ప గౌరవం" అని గిల్ అన్నారు. అలాగే, ఇంగ్లాండ్ పర్యటనను ఉత్సాహభరిత అవకాశంగా పరిగణించి ఆటతో పాటు విలువల ద్వారా ఆదర్శంగా మారే నాయకత్వంతో ముందుకు సాగనున్నట్టు తెలిపాడు. "నిరూపణ ద్వారా మాత్రమే కాకుండా, ఆచరణతో, క్రమశిక్షణ, కఠిన శ్రమ ద్వారా నాయకత్వాన్ని చూపాలనే నమ్మకం నాకు ఉంది" అని అన్నారు.
కెప్టెన్ గా జట్టు ప్లేయర్లను అర్థం చేసుకోవడం ముఖ్యం
ఆటగాళ్లను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అని చెప్పిన గిల్.. "ప్రతి ఆటగాడి వ్యక్తిత్వం వేరేలా ఉంటుంది. మంచి నాయకుడు వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కి ఏం అవసరమో తెలుసుకోవాలి" అని తెలిపాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్‌కు, జింబాబ్వే టూర్‌లో టీ20 జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం గురించి గిల్ మాట్లాడుతూ.. "బ్యాటింగ్‌పై ఫోకస్ కోల్పోకుండా, కెప్టెన్సీని మానసికంగా వేరుగా ఉంచడమెలాగో నేర్చుకున్నాను. అప్పుడే ఆటలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు" అని చెప్పారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గిల్ కామెంట్స్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రస్తావిస్తూ.. విరాట్ ఎప్పుడూ ఢాషింగ్, ప్యాషన్‌తో నడిపించే నాయకుడని, రోహిత్ శాంతంగా, వ్యూహాత్మకంగా, ఆటగాళ్లతో బాగా కమ్యూనికేట్ చేసే నాయకుడని గిల్ పేర్కొన్నాడు. అలాగే, 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 452 పరుగులు చేయడం గుర్తు చేసుకున్నారు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు సాధించాడు గిల్.
ఇంగ్లాండ్ పర్యటన సవాలుతో కూడుకున్నదే కానీ..
ఇంగ్లాండ్ పర్యటన పై మాట్లాడుతూ.. "ఇది సవాలుతో కూడిన పర్యటన. కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఐదు టెస్ట్‌ల సిరీస్ అనుభూతి వేరేలా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి చాలా డిమాండ్ చేస్తుంది. అదే టెస్ట్ క్రికెట్ ప్రత్యేకత" అని గిల్ అన్నారు.
2025 ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కోసం భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్-కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్షన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.