గప్‌చుప్‌గా ఇద్దరు ప్లేయర్స్‌ను దక్కించుకున్న ముంబై.. ట్రేడ్ డీల్ యమా కిరాక్ బాసూ.!
Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ 2026 సీజన్ కోసం రెండు కీలకమైన ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకుంది. ఈ డీల్స్ ద్వారా శార్దూల్ ఠాకూర్, రూథర్‌ఫోర్డ్‌లను జట్టులోకి తిరిగి తీసుకుంది. మరి ఆ డీల్ ఎవరితోనో ఇప్పుడు తెలుసుకుందామా..

ముంబై దెబ్బ..
ఫైవ్ టైం ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 2026 సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువు ముగిసేలోపే రెండు కీలకమైన ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకుంది. ఈ అద్భుతమైన డీల్స్ ద్వారా ముంబై ఇండియన్స్ తమ ఓల్డ్ ఆటగాళ్లయిన శార్దూల్ ఠాకూర్, షేర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను తిరిగి జట్టులోకి తీసుకుంది.
పక్కా వ్యూహం..
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే ముంబై జట్టును మరింత బలోపేతం చేసే దిశగా ఇది మొదటి అడుగు భావించవచ్చు. ఆ జట్టు యాజమాన్యం, కోచ్ పక్కా ప్రణాళికలతో ట్రేడ్స్ కొనసాగిస్తున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా.. క్యాష్ ఆన్ డీల్ రూపంలో ఈ ఇద్దరు ఆటగాళ్లను తిరిగి దక్కించుకుంది ముంబై.
శార్దూల్ ఠాకూర్ రాక..
భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది ముంబై. గతంలో మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా రూ. 2 కోట్లకు శార్దుల్ ఠాకూర్‌ను లక్నో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ తన పాత గూటికి(ముంబై) తిరిగొచ్చాడు శార్దుల్.
శార్దుల్ అద్భుత ఫామ్
గత సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి13 వికెట్లు తీసిన శార్దూల్ రాకతో ముంబై లోయర్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని చెప్పొచ్చు. అలాగే శార్దుల్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి రూ. 2.6 కోట్ల ధరతో ట్రేడ్ చేసుకుంది ముంబై.
సెకండ్ ప్లేయర్ అతడే
రూథర్‌ఫోర్డ్ 2025 సీజన్‌లో గుజరాత్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 291 పరుగులు చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ట్రేడ్‌తో రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ట్రేడ్ అయిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రిటైన్, రిలీజ్ లిస్టు ముందుగానే ముంబై జట్టు సైలెంట్‌గా ఈ ట్రేడ్స్ కంప్లీట్ చేసి.. తన కోర్ టీంను మరింత బలోపేతం చేసుకుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.