ధోని స్కెచ్ అదేనా.. టీ20 డేంజరస్ బ్యాటర్‌పై CSK చూపు.. కోట్లు ఖర్చయినా తగ్గేదేలే
CSK తమ కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. అటు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లను సైతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఆటగాడిని ట్రేడ్ చేసుకోవాలని చెన్నై భావిస్తోందని సమాచారం.

శాంసన్ ట్రేడ్..
చెన్నై చరిత్రలోనే సంజూ శాంసన్‌ది అతిపెద్ద ట్రేడ్ అని చెప్పొచ్చు. శాంసన్ కోసం ఏళ్లుగా తమకు నమ్మకంగా ఉన్న రవీంద్ర జడేజాను వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్. జడేజా, కర్రన్‌కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుంది చెన్నై. సంజూ శాంసన్ ధర రూ. 18 కోట్లు కాగా.. అతడికి బదులుగా రూ. 14 కోట్లకు జడేజాను, కర్రన్‌ను రూ. 4 కోట్లకు రాయల్స్ జట్టుకు ఇచ్చింది. ఇదే అతిపెద్ద ట్రేడ్ కాగా.. ఇప్పుడు మరో ట్రేడ్ లేదా మినీ వేలంలో ఓ ఆటగాడి కోసం కోట్లు ఖర్చు చేయాలని చెన్నై భావిస్తోంది.
చెన్నై సీఈఓ కీలక వ్యాఖ్యలు..
రవీంద్ర జడేజాను విడుదల చేయటం చాలా కష్టమైన నిర్ణయమని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. జడేజా చాలా సంవత్సరాలుగా CSK విజయంలో కీలకపాత్ర పోషించారని, ఇది బహుశా CSK చరిత్రలో అత్యంత కష్టమైన నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆటగాళ్లతో సంప్రదించి తీసుకోవడం చాలా అవసరం అని, అందుకే ఇది పరస్పర అంగీకారం తర్వాత మాత్రమే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. తాను జడేజాతో మాట్లాడినప్పుడు, తన వైట్ బాల్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్న క్రమంలో తనకు కూడా విరామం అవసరమని జడేజా స్పష్టంగా చెప్పినట్లు కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
అశ్విన్ రిటైర్మెంట్..
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్పిన్నర్ కోసం చూస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ ఆఫర్ చేసింది. అయితే దీనికి గుజరాత్ టైటాన్స్ నిరాకరించింది. కాబట్టి ఇప్పుడు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ ఆ జట్టుకు అవసరం. పంజాబ్ ఎలాగో మ్యాక్స్‌వెల్‌ను విడుదల చేసింది కాబట్టి.. అతడ్ని మినీ వేలంలో దక్కించుకోవాలని చెన్నై చూస్తోంది.
మ్యాక్స్‌వెల్ స్పిన్..
చెన్నై పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే మ్యాక్స్‌వెల్‌కు అటు చెన్నై పిచ్‌పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన బిగ్ షో.. కచ్చితంగా స్పిన్‌లో ఆకట్టుకుంటాడని చెన్నై భావిస్తోంది. అలాగే ధోని సారధ్యంలో మ్యాక్సీ ఆటకు పదును పెట్టొచ్చునని.. అశ్విన్ స్థానాన్ని బిగ్ షో కచ్చితంగా భర్తీ చేయగలడని చెన్నై యాజమాన్యం భావిస్తోంది. ఇందుకే మినీ వేలంలో కోట్లు ఖర్చయినా కొనాలని చెన్నై భావిస్తోందట.
రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీరే..
చెన్నై ఈ ప్లేయర్స్‌ను మినీ వేలంలోకి విడుదల చేసింది. ఆ లిస్టులో పలు కీలక ఆటగాళ్లు ఉండగా.. మరికొందరిని తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక వారెవరో ఇప్పుడు చూసేద్దాం.. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, కమలేష్ నాగర్‌కోటి, ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, వంశ్ బేడి, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మతీషా పతిరానాలను చెన్నై విడుదల చేయగా.. సంజూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజా(ట్రేడ్ టూ ఆర్ఆర్), సామ్ కర్రన్(RR ట్రేడ్)లను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ట్రేడ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.