MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • టీమిండియా హీరో.. బెంగాల్ పోలీస్‌ డీఎస్పీగా రిచా ఘోష్

టీమిండియా హీరో.. బెంగాల్ పోలీస్‌ డీఎస్పీగా రిచా ఘోష్

Richa Ghosh DSP : ప్రపంచ కప్ లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా ఘోష్ కు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డీఎస్పీ పదవిని ఇచ్చింది. అలాగే, బంగభూషణ్ అవార్డు ప్రదానం చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 09 2025, 11:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచ కప్ లో సత్తా చాటిన రిఘో ఘోష్
Image Credit : X/RCBTweets

ప్రపంచ కప్ లో సత్తా చాటిన రిఘో ఘోష్

భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకరైన రిఛా ఘోష్ కు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెండు గొప్ప గౌరవాలను అందించింది. 2025 మహిళా ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఆమెను వెస్ట్ బెంగాల్ పోలీస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించారు. అలాగే, ఆమెకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘బంగభూషణ్’ అవార్డును కూడా ప్రదానం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈడెన్ గార్డెన్స్‌లో రిచా ఘోష్ కు ఘన సత్కారం
Image Credit : Instagram@richa9105

ఈడెన్ గార్డెన్స్‌లో రిచా ఘోష్ కు ఘన సత్కారం

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో రిచా ఘోష్ కు ఈ సత్కారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, లెజెండరీ బౌలర్ ఝులన్‌ గోస్వామిల సమక్షంలో రిచా ఘోష్ డీఎస్పీ నియామక పత్రాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలోనే ఆమెకు ప్రభుత్వం నుండి బంగభూషణ్ పతకం, బంగారు గొలుసు, అలాగే రూ. 34 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఆమెను ‘గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్’ తో సత్కరించింది. ఈ రూ. 34 లక్షలు ప్రపంచకప్ ఫైనల్‌లో రిచా ఘోష్ చేసిన 34 పరుగులలో రన్ కు లక్ష చోప్పున అందజేశారు.

36
ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన రిఛా ఘోష్
Image Credit : insta/indiancricketteam

ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన రిఛా ఘోష్

రిచా ఘోష్ 2025 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆమె ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 235 పరుగులు చేసి, భారత ఆటగాళ్లలో అత్యధిక పరుగుల పరంగా ఐదో స్థానంలో నిలిచారు.

దక్షిణాఫ్రికాపై గ్రూప్ దశలో చేసిన 94 పరుగులు ఆమె కెరీర్‌లో కీలక ఇన్నింగ్స్ కాగా, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 16 బంతుల్లో 26 పరుగులు, ఫైనల్‌లో 24 బంతుల్లో 34 పరుగులు భారత విజయంలో కీలకంగా నిలిచాయి.

ఫైనల్‌లో భారత్ 298/7 పరుగులు సాధించింది. షఫాలి వర్మ (87), దీప్తి శర్మ (58)తో పాటు రిచా ఘోష్ చివర్లో వేగంగా ఆడుతూ జట్టు స్కోరును పెంచింది. దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌటవడంతో భారత్ తొలిసారి మహిళా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

46
రిచా ఘోష్ పై సౌరవ్ గంగూలీ, ఝులన్‌ గోస్వామి ప్రశంసలు
Image Credit : X/AITCofficial

రిచా ఘోష్ పై సౌరవ్ గంగూలీ, ఝులన్‌ గోస్వామి ప్రశంసలు

CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రిచా ఘోష్ పై ప్రశంసలు కురిపించారు. దాదా మాట్లాడుతూ.. “నంబర్ 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం సులభం కాదు. రిచా స్ట్రైక్ రేట్ భారత్‌కు విజయాన్ని అందించింది” అని అన్నారు.

ఝులన్‌ గోస్వామి మాట్లాడుతూ.. “2013లో బెంగాల్ క్రికెట్ బలహీనంగా ఉన్నప్పుడు టాలెంట్ హంట్ కార్యక్రమం ప్రారంభించాము. అప్పుడు సిలిగురిలోనే నేను తొలిసారి రిచాను చూశాను” అని భావోద్వేగంతో చెప్పారు.

56
మమతా బెనర్జీ ఏమన్నారంటే?
Image Credit : X/AITCofficial

మమతా బెనర్జీ ఏమన్నారంటే?

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... “ఝులన్‌ గోస్వామి వంటి మహిళలు మహిళా క్రికెట్‌కు పునాది వేశారు. రిచా ఘోష్ ఆ కలను నెరవేర్చింది. ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉంది. కానీ మేము ఆమెపై ఒత్తిడి చేయము. ప్రతి క్రీడలో బెంగాల్ యువత ముందుకు రావాలి” అని అన్నారు.

ఆమెతో పాటు రిచా ఘోష్ తల్లిదండ్రులు మనబేంద్ర ఘోష్, స్వప్న ఘోష్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.

66
రైజింగ్ స్టార్ రిచా ఘోష్
Image Credit : Getty

రైజింగ్ స్టార్ రిచా ఘోష్

22 ఏళ్ల రిచా ఘోష్.. సిలిగురి యువతి, ఇప్పుడు డీఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టబోతోంది. 2020లో భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆమె, 2023లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైంది.

ఇప్పుడు ఆమె 2025 సీనియర్ మహిళా ప్రపంచకప్ గెలిచిన జట్టులో ముఖ్య పాత్ర పోషించింది. క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ప్రభుత్వ సేవలో అడుగుపెడుతున్న ఆమె కథ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
వరుసగా 8 సిక్సర్లు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఎవరీ ఆకాష్ కుమార్ చౌదరి?
Recommended image2
రాజస్థాన్ రాయల్స్ మాస్టర్ ప్లాన్.. చెన్నై సూపర్ కింగ్స్ అంతపని చేస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved