MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Rajasthan Royals : షేన్ వార్న్ కుటుంబానికి రూ. 450 కోట్లు.. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదే !

Rajasthan Royals : షేన్ వార్న్ కుటుంబానికి రూ. 450 కోట్లు.. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదే !

Rajasthan Royals Sale : ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు విక్రయం జరిగింది. అయితే, 18 ఏళ్ల క్రితం షేన్ వార్న్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన కుటుంబానికి ఏకంగా రూ. 450 కోట్లు అందనున్నాయి. ఈ జాక్ పాట్ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 25 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షేన్ వార్న్ మాస్టర్ మైండ్: 18 ఏళ్ల క్రితం వేసిన ప్లాన్‌తో ఇప్పుడు రూ. 450 కోట్లు!
Image Credit : Getty

షేన్ వార్న్ మాస్టర్ మైండ్: 18 ఏళ్ల క్రితం వేసిన ప్లాన్‌తో ఇప్పుడు రూ. 450 కోట్లు!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో క్రికెట్ మైదానంలో ఆట కంటే కూడా తెరవెనుక జరుగుతున్న వ్యాపార లావాదేవీలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) వంటి దిగ్గజ ఫ్రాంచైజీల విక్రయ వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ కుటుంబానికి ఏకంగా రూ. 450 కోట్ల రూపాయలు అందనున్నాయన్న వార్త. ఒక ఆటగాడిగా కాకుండా, ఒక దూరదృష్టి గల వ్యాపారవేత్తగా వార్న్ 2008లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అతని కుటుంబానికి భారీ సంపదను తెచ్చిపెడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్ఆర్ ను అమ్మింతే వార్న్ కుటుంబానికి ఎందుకు లాభం?
Image Credit : Getty

ఆర్ఆర్ ను అమ్మింతే వార్న్ కుటుంబానికి ఎందుకు లాభం?

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్ ప్రారంభమైనప్పుడు, రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. ఆ సమయంలో వార్న్ ఫ్రాంచైజీ ముందు ఒక వినూత్నమైన షరతు పెట్టారు. అప్పట్లో ఐపీఎల్ సక్సెస్ అవుతుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ వార్న్ మాత్రం తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తన జీతంతో పాటు జట్టులో వాటాను కోరారు. ఫిబ్రవరి 24న రాజస్థాన్ రాయల్స్ జట్టును కాల్ సోమనీకి చెందిన అమెరికా గ్రూప్ 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,290 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ భారీ డీల్ కారణంగా 18 ఏళ్ల క్రితం వార్న్ చేసుకున్న ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది.

35
కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకు మించి!
Image Credit : our own

కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకు మించి!

2008లో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ వార్న్‌ను కేవలం ఒక ఆటగాడిగా చూడలేదు. వారికి అప్పట్లో అనుభవజ్ఞులైన కోచ్‌లు లేదా గైడ్‌లు లేరు. దీంతో వార్న్‌కు కెప్టెన్సీతో పాటు కోచ్ బాధ్యతలను, జట్టు ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం, వార్న్ ఆడే ప్రతి ఏడాదికి గానూ జట్టులో 0.75 శాతం యాజమాన్య వాటాను ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి గతంలో వార్న్ మాట్లాడుతూ, "నేను కేవలం కెప్టెన్‌ను మాత్రమే కాదు, జట్టుకు సంబంధించి సర్వం నేనే అయి వ్యవహరించాలని వారు కోరారు. అందుకే నా ఒప్పందంలో వాటాను భాగం చేశాను" అని వెల్లడించారు.

45
వార్న్ రూ. 450 కోట్ల లెక్క ఇదీ !
Image Credit : our own

వార్న్ రూ. 450 కోట్ల లెక్క ఇదీ !

షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మొత్తం నాలుగు సీజన్ల పాటు కొనసాగారు. 2008లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టును అద్భుత నాయకత్వంతో తొలి ఐపీఎల్ విజేతగా నిలిపారు. అలా నాలుగు ఏళ్ల కాలంలో ఆయన వాటా మొత్తం 3 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఫ్రాంచైజీ విలువ 1.63 బిలియన్ డాలర్లుగా నిర్ణయించబడటంతో, వార్న్ కు ఉన్న 3 శాతం వాటా విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 450 నుంచి 460 కోట్ల మధ్యలో ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో వార్న్ సీజన్‌కు రూ. 2.34 కోట్లు జీతం తీసుకునేవారు, కానీ ఆయన వాటా రూపంలో సంపాదించిన ఆస్తి ఇప్పుడు కోట్లకు చేరింది.

55
వార్న్ దూరదృష్టికి ఇది నిదర్శనం
Image Credit : our own

వార్న్ దూరదృష్టికి ఇది నిదర్శనం

సాధారణంగా ఆటగాళ్లు తమ కెరీర్ ముగిసే వరకు కేవలం మ్యాచ్ ఫీజులు, ఎండార్స్‌మెంట్లపైనే దృష్టి పెడతారు. కానీ షేన్ వార్న్ ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఈ లీగ్ సృష్టించబోయే సంపదను ముందే ఊహించారు. 2022లో ఆయన మరణించినప్పటికీ, ఆయన చేసిన ఆ ఒప్పందం నేడు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు తన ఆటతోనే కాకుండా, తన తెలివితేటలతో ఇంతటి భారీ మొత్తాన్ని ఆర్జించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ విక్రయం ఇప్పుడు స్పోర్ట్స్ బిజినెస్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Recommended image2
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన భారతీయులు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved