షూ లేస్ కట్టుకున్నందుకు కోటి రూపాయలు తీసుకున్న పీలే... ఫుట్‌బాల్ లెజెండ్ క్రేజ్‌కి...
ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే మరణం సాకర్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఫిఫా వరల్డ్‌లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా కీర్తి ఘడించిన పీలే పూర్తి పూర్తి పేరు ఎడ్సన్ అరంటెస్ డో నసిమెంటో. 1940 అక్టోబర్ 23న జన్మించిన పీలే, 82 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు...
Pele
2000లో వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ అవార్డు గెలుచుకున్న పీలే, 1279 గోల్స్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోనూ స్థానం దక్కించుకున్నారు. బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు...
రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది...
అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న స్ట్రాటెజీని వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు..
దాంతో టీవీ కెమెరామెన్, పీలే షూస్ వైపు ఫోకస్ పెట్టడం... తమ ఫెవరెట్ ఫుట్‌బాల్ స్టార్ వాడుతున్నది పూమా బ్రాండ్ షూస్ అని ప్రపంచానికి తెలిసిపోవడం, ఒక్కసారిగా ఆ బ్రాండ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడం జరిగిపోయాయి. పీలే వాడుతున్న పూమా బూట్లు కొనడం కోసం జనం ఎగబడ్డారు...
కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ.
క్రిస్టియానో రొనాల్డో కోకకోలా బాటిల్స్ తీసి పక్కనబెట్టినందుకు ఆ కంపెనీకి కోట్ల రూపాయల్లో నష్టం వచ్చినట్టు, మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే...
pele football
తన సుదీర్ఘ కెరీర్‌లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు.