పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్.. అడుగు దూరంలో లోవ్లినా బోర్గోహైన్ !
Lovlina Borgohain : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మరో మెడల్ కు అడుగు దూరంలో ఉంది. బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకాన్ని అందించడానికి సిద్ధమైంది.
Lovlina Borgohain
Lovlina Borgohain : భారత స్టార్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ జర్మనీకి చెందిన సున్నివా హాఫ్ట్‌సాడ్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె గెలిచిన కాంస్యానికి మరో ఒలింపిక్ పతకాన్ని జోడించడానికి కేవలం ఒక గెలుపు దూరంలో ఉంది.
బుధవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 75 కేజీల రౌండ్ 16 బౌట్‌లో జర్మనీకి చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌ను వరుస పంచ్ లు కురిపిస్తూ లోవ్లినా బోర్గోహైన్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. తన రెండో ఒలింపిక్ మెడల్ ను అందుకోవడానికి ముందుకు సాగుతోంది.
Olympics
ఆగస్ట్ 4న 8వ రౌండ్ లో ఆమె టాప్-సీడ్ చైనీస్ లి కియాన్‌తో తలపడుతుంది. ఇక్కడ గెలుపు అంత సులభంగా కనిపించడం లేదు. కానీ, లోవ్లినా బోర్గోహైన్ దూకుడు చూస్తుంటే విజయం ఖాయమనే తెలుస్తోంది. ఈ బౌట్‌లో గెలిస్తే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఈ రోజు మ్యాచ్ ను గమనిస్తే.. లోవ్లినా బోర్గోహైన్ అద్భుతమైన ప్రదర్శనతో ఖచ్చితమైన పంచ్ లు కురిపించింది. ప్రత్యర్థి ఆమెను స్లగ్‌ఫెస్ట్‌లోకి లాగడానికి వరుసగా ట్రై చేసినా బోర్గోహైన్ ఎదురుదాడిలో క్లీన్ పంచ్ లతో షాకిచ్చింది. ఈ సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించడం గమనార్హం.
Lovlina Borgohain
ఆగస్టు 4న లోవ్లినా బోర్గోహైన్ ప్రత్యర్థి కియాన్ మిడిల్-వెయిట్ (75కిలోలు) విభాగంలో టోక్యో గేమ్స్ లో రజత పతక విజేతతో తలపడనుంది. ఆమె 2016 రియో గేమ్స్‌లో కాంస్యం గెలుచుకుంది. 2022 చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని సాధించింది.
lovlina borgohain
కాగా, పారిస్ ఒలింపిక్స్ లో భారత బాక్సింగ్ ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా ఉంది. ఆరుగురిలో ముగ్గురు పోటీలో ఉన్నారు. ప్రారంభంలోనే అవుట్ అయిన వారిలో మాజీ ఆసియా గేమ్స్ ఛాంపియన్ అమిత్ పంఘల్ (51 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు) ఉన్నారు.
Nikhat Zareen, Lovlina Borgohain, Indian boxers
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (మహిళల 50 కేజీలు), నిశాంత్ దేవ్ (పురుషుల 71 కేజీలు) అరంగేట్రం ద్వయం బోర్గోహెయిన్‌తో పాటు ఇంకా పారిస్ ఒలింపిక్స్ పోటీలో మిగిలి ఉన్నారు.