MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Sanju Samson : ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజూ శాంసన్... ప్రైజ్ మనీ సంగతేంటి..?

Sanju Samson : ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజూ శాంసన్... ప్రైజ్ మనీ సంగతేంటి..?

Sanju Samson : వరల్డ్ కప్ 2026 లో ఆడింది కొన్నిమ్యాచులే అయినా పరుగుల వరద పారించాడు సంజూ శాంసన్. దీంతో అతడిని ప్లేయర్ ఆప్ ది టోర్నమెంట్ గా ఎంపిక చేశారు. దీనికింద అతడికి లభించే ప్రైజ్ మనీ ఎంత..?

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 09 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సంజూ శాంసన్
Image Credit : Getty

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా సంజూ శాంసన్

Sanju Samson : స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్ ఆరంభంనుండి అదరగొట్టింది... సూపర్-8 లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా అన్నీ విజయాలే. అయితే కీలక సమయంలో జట్టులోకి వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి పోటీపడ్డ ఆటగాళ్లు వీళ్లే..
Image Credit : Getty

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి పోటీపడ్డ ఆటగాళ్లు వీళ్లే..

ఈ వరల్డ్ కప్ 2026 లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' ను ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఎంపికచేసింది ఐసిసి. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడిన ఎనిమిదిమంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది... వీరిలో అభిమానులు టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ కే ఓటేశారు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది.

అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ కూడా దీనికోసం పోటీపడ్డాడు. అతడు 8 మ్యాచుల్లో 226 పరుగులు చేశాడు... 9 వికెట్లు పడగొట్టాడు. అయితే సెమీఫైనల్లో భారత్ తో జరిగిన మ్యాచులో ఇతడు పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవకాశాన్ని కోల్పోయాడు.

ఇక పాకిస్థాని ప్లేయర్ షహిబ్జాదా పర్హాన్, సౌతాఫ్రికా ప్లేయర్స్ లుంగి ఎంగిడి, ఎయిడెన్ మార్క్రమ్, యూఎస్ ఆటగాడ షాడ్లీ వాన్ షాల్వ్విక్ కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో నిలిచారు. ఫైనల్లో భారత్ తో తలపడ్డ న్యూజిలాండ్ నుండి రచిన్ రవీంద్ర, టీమ్ సీఫెర్డ్ కూడా పోటీలో నిలిచారు. వీరందరిని కాదని అభిమానులు సంజూ శాంసన్ నే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు ఎంపికచేశారు.

Related Articles

Related image1
Now Playing
Sanju Samson Creates History: సంజూ శాంసన్ విధ్వంసం..వరుసగా మూడో హాఫ్ సెంచరీ | Asianet News Telugu
Related image2
Sanju Samson : సచిన్ ఒక్క ఫోన్ కాల్.. సంజూ తలరాత మారిపోయింది! అసలు ఏం జరిగిందంటే?
35
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఎంత..?
Image Credit : Getty

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఎంత..?

టీ20 వరల్డ్ కప్ విజేతలకు ఐసిసి భారీ ప్రైజ్ మనీ అందించే విషయం తెలిసిందే. విజేతగా నిలిచిన భారత్ కు 3 మిలియన్ డాలర్స్ అంటే సుమారు 27.48 కోట్లు లభించనున్నాయి... రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ కు 1.6 మిలియన్ డాలర్ అంటే దాదాపు రూ.14.65 కోట్లు లభించనున్నాయి. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు భారీ నగదు బహుమతి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు ఎంపికైన ఆటగాడికి ఐసిసి కేవలం జ్ఞాపిక మాత్రమే అందిస్తుంది... ఎలాంటి నగదు బహుమతి ఉండదు.

45
సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ లు ఇవే..
Image Credit : X

సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ లు ఇవే..

సంజూ శాంసన్ ఈ వరల్డ్ కప్ ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సూపర్-8 లో వెస్టిండిస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో సంజూ ఆడిన ఇన్నింగ్స్ కూడా మర్చిపోలేనిది. అతడు 89 పరుగులతో చెలరేగడంతో భారత్ భారీ పరుగులు సాధించింది... ఇంగ్లాండ్ ను ఓడించగలిగింది. ఇక ఫైనల్లోనూ న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతూ మరోసారి 89 రన్స్ చేశాడు. ఇలా ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచులే ఆడిన అతడు 321 పరుగులు చేశాడు.

55
వరల్డ్ కప్ అవార్డుల విజేతలు..
Image Credit : Getty

వరల్డ్ కప్ అవార్డుల విజేతలు..

• ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: సంజూ శాంసన్ (5 మ్యాచ్‌ల్లో 321 పరుగులు, వరుసగా 3 హాఫ్ సెంచరీలు).

• ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్): జస్ప్రీత్ బుమ్రా (4/15 ).

• అత్యధిక వికెట్లు: జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి (ఇద్దరూ 14 వికెట్లు).

• అత్యధిక పరుగులు: పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్ (6 మ్యాచ్‌ల్లో 383 పరుగులు, ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు)

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Related Stories
Recommended image1
Now Playing
Sanju Samson Creates History: సంజూ శాంసన్ విధ్వంసం..వరుసగా మూడో హాఫ్ సెంచరీ | Asianet News Telugu
Recommended image2
Sanju Samson : సచిన్ ఒక్క ఫోన్ కాల్.. సంజూ తలరాత మారిపోయింది! అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved