- Home
- Sports
- Mirabai Chanu: దుంగలు మోసే స్థాయి నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. మీరాబాయి విజయం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.
Mirabai Chanu: దుంగలు మోసే స్థాయి నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. మీరాబాయి విజయం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.
Mirabai Chanu: భారత వెయిట్ లిఫ్టర్ స్టార్ మీరాబాయి అద్భుతం సృష్టించింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని పలు కీలక అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మీరాబాయి చాను రజతం
భారత వెయిట్‌లిఫ్టర్ స్టార్ మీరాబాయి చాను 3 సంవత్సరాల తర్వాత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. నార్వేలోని ఫోర్డే లో జరిగిన మహిళల 48 కిలోల విభాగంలో ఆమె 199 కిలోల మొత్తం (84 కిలోలు స్నాచ్, 115 కిలోలు క్లీన్ & జర్క్) ఎత్తి అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయంతో భారత్ 2022 తర్వాత మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. స్వర్ణ పతకం ఉత్తర కొరియా క్రీడాకారుడు రీ సాంగ్ గమ్ గెలిచారు, కాంస్య పతకం థాయ్‌లాండ్ క్రీడాకారుడు థాన్యాథాన్ సుక్చారోన్ సాధించారు.
మూడో ప్రపంచ పతకం, కెరీర్ రికార్డు
ఫోర్డేలో సాధించిన రజతం మీరాబాయి చానుకు మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం.
2017లో ఆమె అనహైమ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది (48 కిలోలు, 194 కిలోలు మొత్తం).
2022లో బొగోటాలో రజతం గెలుచుకుంది (200 కిలోలు).
ఈ 2025 రజతం ద్వారా ఆమె భారత్‌లోని అత్యంత విజయవంతమైన మహిళా వెయిట్‌లిఫ్టర్లలో ఒకరని మరోసారి నిరూపించింది.
గతంలోనూ..
2017లో కాలిఫోర్నియాలోని అనహైమ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి.. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదికపై పతకాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్ తర్వాత మీరాబాయికి ఇది రెండో అతిపెద్ద పోటీ. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా చాను 199 కిలోల (స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ & జర్క్‌లో 111 కిలోలు) బరువు ఎత్తినప్పటికీ, నాలుగో స్థానంతో సరిపెట్టుకుని స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయింది
దుంగలు మోసే స్థాయి నుంచి..
1994, ఆగష్టు 8న మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోకి నాంగ్‌పోక్ కక్చింగ్‌లో జన్మించింది మిరాబాయి చాను. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చాను వంట కలప కోసం అన్నతో కలిసి అడవిలోకి వెళ్తుండేది. ఆ సమయంలో తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసి అందరినీ ఆశ్చర్యపరిచింది మీరాబాయి. అలా చిన్న వయసులోనే ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించిన కుటుంబం శిక్షణ ఇప్పించింది. ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది ఆమె తల్లిదండ్రుల. అందుకు తగ్గట్లుగా రాణిస్తూ.. పేరెంట్స్ కలలను సాకారం చేస్తూ వస్తోంది చాను.