ఇలాగైతే కష్టమే మరి.. అభిషేక్ శర్మకు బిగ్ వార్నింగ్ !
Irfan Pathan warns Abhishek Sharma : అగ్రెసివ్ ఆటకు కూడా ఒక హద్దు ఉండాలని టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మను హెచ్చరించాడు. దూకుడుకూ ఓ హద్దు ఉండాలనీ, ప్రతి బాల్ కు ముందుకు రావద్దని పేర్కొన్నాడు.

ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్
టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్ ఇచ్చాడు. అతి దూకుడు పనికిరాదని పేర్కొన్నాడు. అన్ని పరిస్థితులను ఏదుర్కొనే విధంగా ఆటను నైపుణ్యం సాధించాలన్నాడు. అతను క్రికెట్ అన్ని ఫార్మాట్లలో ప్రత్యేకంగా సిద్ధమైన బౌలర్లకు ఎదుర్కొనే విధంగా మారాలనన్నారు.
పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. “అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు, కానీ వరల్డ్ కప్‌లో జట్లు ప్లేయర్లను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉంటాయి. అభిషేక్ ప్రతి బౌలర్ మీద ప్రతి ఇన్నింగ్స్ మొదటి బంతికి స్టేప్ అవుట్ అవుతూ ఉంటే అతన్ని బోల్తా కోట్టించడానికి ప్లాన్స్ సిద్ధం అవుతాయి. అతను షాట్స్ ఎంపిక చేసుకుని ఆడాలి” అని అన్నారు.
ప్రపంచ క్రికెట్ సంచలనం అభిషేక్ శర్మ
25ఏళ్ళ అభిషేక్ శర్మ.. 2025లో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. ఆసియా కప్‌లో ఇండియాను అజేయంగా నిలిపి ట్రోఫీని అందించాడు. అతను టోర్నమెంట్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచారు. అదే జోరును భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో కూడా కొనసాగించాడు. ఆస్ట్రేలియాలో ముగిసిన ఐదు మ్యాచ్ టి20 సిరీస్‌లో 163 రన్స్ చేసి 40.75 సగటుతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
దూకుడుకు పెట్టింది పేరు అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ తనదైన దూకుడుతో ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అతను క్రీజులోకి అడుగుపెట్టగానే మొదటి బంతినుంచే బౌలర్లపై దాడి చేస్తాడు. ప్రస్తుతం అతను బ్యాటింగ్ కు రాగానే మొదటి బంతిని క్రీజు వదిలి ముందుకు వచ్చి బాదలని చూస్తుంటాడు. అయితే, ఇలా ప్రతిసారి చేయడం వల్ల బౌలర్లు దాని మీద దృష్టి పెట్టి బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. ఐదుమ్యాచ్ సిరీస్‌లో అతను మెల్బోర్న్ లో క్లిష్టమైన పిచ్‌పై 37 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు మెరుగైన ప్రారంభం ఇచ్చారు. అయినా ఆ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్లతో ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియా సిరీస్ భారత్ సొంతం
వర్షం కారణంగా కొన్ని ఓవర్లు సాగిన బ్రిస్బేన్ మ్యాచ్ చివరికి రద్దు అయింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ ఆస్ట్రేలియా బౌలర్ ఎల్లీస్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతని బౌలింగ్ వేరియంట్లు అభిషేక్ శర్మను ఇబ్బంది పెట్టాయి. పఠాన్ చెప్పినట్లే ఎల్లీస్ అతన్ని మూడుసార్లు ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ లో అతను ఇచ్చిన రెండు క్యాచ్ లు మిస్ అయ్యాయి. ఫీల్డర్ల తప్పిదం వల్ల బతికిపోయాడు. ఇలాంటి వేరియేషన్లను ప్రపంచస్థాయిలో జట్లు పవర్ ప్లే లో ఎక్కువగా వినియోగిస్తాయని పఠాన్ చెప్పారు.
మార్పుల అవసరం.. లేకుంటే కష్టం
అభిషేక్ శర్మ అగ్రెసివ్ యాటిట్యూడ్ చూపించాలి కానీ, హద్దులు కూడా ఉండాలని పఠాన్ అన్నారు. ప్రతిసారి ముందుకు వచ్చి ఆడటం వల్ల సక్సెస్ సాధించలేరనీ, షాట్స్ ఎంపికలో జాగ్రత్తలు అవసరమని అన్నారు. “రోజు ప్రతి బౌలర్‌పై ముందు అడుగు వేయలేరు. అగ్రెసివ్ అప్రోచ్‌కు కూడా ప్లాన్, వ్యూహం ఉండాలి” అని పఠాన్ అన్నారు. ఈ విషయం గురించి అతని వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ తో కూడా తాను మాట్లాడతాననీ, ఆయన కూడా దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరముందని అన్నాడు.