- Home
- Sports
- కావ్య పాపది పెద్ద స్కెచే.. ఆ ముగ్గురు బాహుబలి బ్యాటర్లు టీంలోనే.. రిలీజ్ చేసేది ఎవరినంటే.?
కావ్య పాపది పెద్ద స్కెచే.. ఆ ముగ్గురు బాహుబలి బ్యాటర్లు టీంలోనే.. రిలీజ్ చేసేది ఎవరినంటే.?
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 కోసం బ్యాటింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లను నిలబెట్టుకోవాలని చూస్తోంది, అయితే బౌలింగ్‌ను బలోపేతం చేయడం సవాలుగా మారనుంది. మినీ-ఆక్షన్‌లో నాణ్యమైన స్వదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే ఛాన్స్ లేకపోవడంతో..

రిటైన్, రిలీజ్ లిస్టుపై కసరత్తులు
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చివరి దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ, బ్యాటింగ్ తప్పితే.. బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని అభిమానుల మాట. అందుకే మినీ-ఆక్షన్ కోసం పలు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా రిటైన్, రిలీజ్ లిస్టుపై కసరత్తులు చేస్తోంది.
ముగ్గురూ SRH బ్యాటింగ్‌కు వెన్నెముక
బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వీరి ముగ్గురూ SRH బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచారు. ట్రావిస్ హెడ్‌ను 14 కోట్లకు, హెన్రిచ్ క్లాసెన్‌ను 23 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఇషాన్ కిషన్ ను 11 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన SRH అతడికి కూడా మరో అవకాశాన్ని ఇవ్వాలని భావిస్తోంది. అటు అభినవ్ మనోహర్‌ను కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.
SRHకు ప్రధాన బలహీనత
బౌలింగ్ విభాగం SRHకు ప్రధాన బలహీనతగా మారింది. మహమ్మద్ షమీ వంటి ఆటగాడు ఫామ్‌లో లేకపోవడం, హర్షల్ పటేల్ స్థిరమైన ప్రదర్శన కనబరచకపోవడం జట్టుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. షమీ, హర్షల్ పటేల్‌లను రిలీజ్ చేస్తే దాదాపు 18 కోట్లు పర్స్ వాల్యూ లభించే అవకాశం ఉంది. జయదేవ్ ఉనద్కత్, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను కూడా రిలీజ్ చేయడం ద్వారా మొత్తం 25-30 కోట్లు పర్స్ వాల్యూ లభించవచ్చు. ఈ పర్స్ వాల్యూతో, SRH ఒక మంచి ఫాస్ట్ బౌలర్‌ను, ఒక నాణ్యమైన స్పిన్నర్‌ను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం
పాట్ కమిన్స్, ఇషాన్ మలింగలతో పాటు మరొక బౌలర్ అవసరం ఉంది. మినీ-ఆక్షన్‌లో బెటర్ స్పిన్నర్లు విడుదల కావడం అరుదు. SRH గతంలో సుయాష్ శర్మ వంటి ప్లేయర్స్ ను కోల్పోయింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో రాణించలేకపోతున్న నటరాజన్‌ను ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అతడి విలువ 4-5 కోట్లకు తగ్గవచ్చని అంచనా. నటరాజన్ గతంలో SRH తరఫున మిడిల్ ఓవర్లలో, చివరి ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి, SRH అతడిని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది బౌలింగ్ విభాగంలో కొంత ఉపశమనం కలిగించవచ్చు.
SRHకు అతిపెద్ద సవాలు
అనికేత్ వర్మ (30 లక్షలు), నితీష్ కుమార్ రెడ్డి (6 కోట్లు) వంటి యువ ఆటగాళ్ల భవితవ్యం కూడా ముఖ్యమైనది. అనికేత్ వర్మ ప్రస్తుత ధరతో కొనసాగడానికి ఇష్టపడకపోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో నిరాశపరిచినా, అతడు ఒక అప్‌కమింగ్ ఇండియన్ ప్లేయర్ కావడంతో SRH అతడిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా, SRH బ్యాటింగ్ యూనిట్‌ను నిలబెట్టుకుంటూ, బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పర్స్ వాల్యూ నిర్వహణ, మినీ-ఆక్షన్‌లో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను గుర్తించడం SRHకు అతిపెద్ద సవాలుగా నిలవనుంది.